బాలీవుడ్ రెబల్ క్వీన్ కంగనా రనౌత్ డ్యాషింగ్ యాటిట్యూడ్ కి దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు నాయికా ప్రధాన చిత్రాలలో నటిస్తూ అగ్ర హీరోయిన్ గా బాలీవుడ్ ని ఏల్తోంది. అదే స్థాయిలో వివాదాలతోనూ పాపులారిటీ పెంచుకుంది. దర్శకులు రచయితలు స్టార్ హీరోలతో కంగనకు వివాదాలున్నాయి. రాజకీయ నాయకులతోనూ కోర్టు గొడవలు ఇటీవల సంచలనంగా మారాయి. ముఖ్యంగా శివసేన పార్టీ అధినాయకులతోనే కంగన తలపడడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రత్యర్ధి ఎంతటి వారైనా సరే ధీటుగా.. ధైర్యంగా ముందుకెళ్లి వాధించడం కంగన స్టైల్. కంటెంట్ ఏదైనా సరే తనదైన శైలిలో చెలరేగుతూ మీడియా హెడ్ లైన్స్ లోకొస్తోంది. మీటూ ఉద్యమం అయినా.. పారితోషికం విషయంలోనైనా.. మహిళా హక్కుల పై నిలదీయాలన్నా.. దేనికైనా తనదైన శైలిలో స్పందిస్తోంది కంగన. కారణం ఏదైనా ఇటీవల కంగనకు బయట మిత్రులతో పాటు శత్రువులు కూడా తయరాయ్యారు.
ఎప్పుడూ వివాదాస్పద అంశంతో బాలీవుడ్ మీడియాని హీటెక్కించే ధోరణి కంగనలో కనిపిస్తోందన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఇదంతా ఒకెత్తు అనుకుంటే.. కంగన వెంట ఏకంగా ఏకే 47 గన్ తో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బంది తనవెంటే ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల బుడాఫెస్ట్ లో `ధాకడ్` షూటింగ్ పూర్తి చేసుకుని కంగన ముంబైకి చేరుకుంది. కాగా బుధవారం ఆమె ముంబైలో తన వ్యక్తిగత పనులపై బయటకు వచ్చినప్పుడు సెక్యురిటీ సిబ్బంది తనకు కాపలాగా కనిపించడం సందేహాల్ని రేకెత్తించింది. కంగన కు ప్రత్యర్థుల నుంచి థ్రెట్ పెద్ద స్థాయిలోనే ఉందని తాజా పరిణామం చెబుతోంది. అందుకే ఇంతటి పటిష్టమైన బందోబస్త్ ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కల్పించింది! అన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్యూరిటీనా ? లేక కంగన ఏర్పాటు చేసుకున్న ప్రయివేట్ సెక్యూరిటీనా? అన్నదానిపై క్లారిటీ లేదు. ఇంకాస్త వివరంగా ఆరాలు తీస్తే.. ఇది Y- ప్లస్ కేటగిరీ CRPF సెక్యూరిటీ అని తెలిసింది. దీనిని హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తుంది. ఇది కంగనకు ఉచితంగా అందుబాటులో ఉంది.
ఇకపోతే ముంబైలో భారీగా వర్షాలు పడుతోన్న సమయంలో ముంబై వీధుల్లో కంగనా ఇలా క్యాజువల్ లుక్ తో కనిపించడం వెనుక సీరియస్ విషయం ఉందనే మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. కంగన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడిని కలిసేందుకు వెళుతోందన్న ప్రచారం సాగుతోంది. మరి ఆ సంగతేంటో కంగన స్వయంగా వెల్లడిస్తుందేమో చ ఊడాలి. క్వీన్ ప్రస్తుతం తాజా చిత్రం `ధాకడ్` పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇందులో కంగన ఏజెంట్ అగ్ని పాత్రలో కనిపించనున్నారు. ఈ స్పై థ్రిల్లర్ చిత్రానికి రజ్నీష్ రాజీ ఘయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తలైవి చిత్రీకరణ పూర్తయి నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. ఈ సినిమాని త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. తెలుగు-తమిళం-హిందీ సహా బహుభాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.