బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పుడూ అంతే.. తనేం మాట్లాడాలనుకుందో అదే మాట్లాడుతుంది. తనేం చెయ్యాలనుకుందో అదే చేస్తుంది. ఈ విషయంలో ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అనే టైప్. అందుకే ఆమె ప్రతిభకు ఎన్ని ప్రశంసలు లభిస్తాయో.. ఆమె తీరుపై అన్న విమర్శలూ వస్తుంటాయి. వివాదాలెన్ని చుట్టుముట్టినా తన దారి తనదే అన్నట్టుండే కంగనాకు ప్రత్యేకమైన అభిమానులే ఉన్నారు.
తాజాగా ముంబయిలో ఆమె ఫొటో తీసుకోవడం కోసం ఫొటోగ్రాఫర్లు ఎనిమిది గంటల సేపు నిరీక్షించాల్సి వచ్చింది. ముంబయిలో ఓ షాపింగ్ మాల్ లోపలకు వెళ్లిన కంగన తిరిగి వచ్చి ఫొటోలకు ఫొజులిచ్చే తరుణం కోసం ఫొటోగ్రాఫర్లంతా మాల్ బయట పడిగాపులు కాస్తూే కూర్చున్నారు. ఎనిమిది గంటల తర్వాత బయటకు వచ్చిన కంగన క్షణం కూడా ఆగకుండా వారందరి వంక కన్నెత్తయినా చూడకుండా కారెక్కి తుర్రుమంది. దీంతో ఆమె వ్యవహార శైలిపై ఫొటోగ్రాఫర్లందరికీ అరికాలి మంట నెత్తికెక్కింది.
కంగనా ప్రస్తుతం తెలుగు దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో ‘మణికర్ణిక - ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ అనే చారిత్రక సినిమా చేస్తోంది. హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టంట్ల కోసం హాలీవుడ్ నిపుణులు పని చేస్తున్నారు. ఈ సినిమాతో కంగనా తనలోని యాక్షన్ టాలెంట్ ను కూడా ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. దీనికన్నా ముందుగా సెప్టెంబరులో ఆమె నటించిన సిమ్రన్ సినిమా విడుదల కానుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/