బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మిగతా వారికన్నా ఎప్పుడూ కాస్తంత డిఫరెంటే. ఆమెను ఏదన్నా ప్రశ్న అడిగితే ఠక్కున ఆన్సరొచ్చేస్తుంది. మనసులో ఏదనుకుందో అది చెప్పేస్తుంది. సింపుల్ అండ్ స్ట్రయిట్ అన్న తరహాలో మాట్లాడినా అందరూ ఆలోచించేలానే మాట్లాడుతోంది. ఇది కొన్నిసార్లు కాంట్రవర్షియల్ గా మారినా కంగనా మాత్రం తన రూటే సెపరేట్ అన్నట్టుగానే ఉంటుంది.
కొత్త వాళ్ల నుంచి మొదలు సీనియర్ హీరోయిన్ల వరకు చిట్ చాట్ కు వస్తే కచ్చితంగా వారికి ఎదురయ్యే ప్రశ్న కాబోయే వాడెలాగుండాలి అని. జోవియల్ గా ఉండాలి.. నవ్విస్తుండాలి. నిజాయతీ నిలువెత్తు రూపంలా ఉండాలి.. హ్యాండ్సమ్ గా ఉండాలి. ఇంత హైట్.. అంత వెయిట్ అంటూ హీరోయిన్లు ఏంటేంటో చెబుతారు. ఇదే మాట కంగనాను అడిగితే మాత్రం తనకు కాబోయేవాడు కచ్చితంగా దేశభక్తుడై ఉండాలంటోంది. ఒకవేళ తనకు లవర్ అయ్యాక దేశభక్తుడు కాదని తెలిస్తే తక్షణం వదిలేస్తానంటోంది. నేను నా దేశాన్ని ప్రేమిస్తా. నా బాయ్ ఫ్రెండ్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటా అంటోంది.
పుట్టి పెరిగిన దేశాన్ని గౌరవించ లేనివాడికి ప్రేమించిన అమ్మాయంటే గౌరవం ఉంటుందని నేను అనుకోను అంటూ సింగిల్ లైన్ స్టేట్ మెంట్ తో తన ఫీలింగ్ చెప్పేసింది. బాయ్ ఫ్రెండ్ లో ఇలాంటి క్వాలిటీ ఉండాలని కోరుకున్న మొదటి హీరోయిన్ కంగనాయే. ప్రస్తుతం కంగనా మణికర్ణిక : క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమాలో నటిస్తోంది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరనారి ఝాన్సీలక్ష్మీబాయ్ జీవితగాథగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మన తెలుగు వాడైన క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు.