ముఖ్య‌మంత్రి ఠాక్రేపై త‌లైవి క‌న్నెర్ర‌ అందుకేనా?

Update: 2021-09-20 03:30 GMT
బాలీవుడ్ న‌టి కంగ‌న‌ ర‌నౌత్ దుందుడుకు గురించి తెలిసిందే. నిరంత‌రం ఇండ‌స్ట్రీ కొలీగ్స్ నాయ‌కుల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాడికి ప్ర‌తి దాడి ఆమె నైజం. ప్ర‌త్య‌ర్ధి ఎంత‌టి బ‌ల‌మైన వాడైనా స‌రే త‌న‌దైన శైలిలో ధీటైన బ‌దులివ్వ‌డం కంగ‌న ప్ర‌త్యేక‌త‌. కంగ‌న‌తో పెట్టుకుంటే సీన్ సితారే అన్న సంద‌ర్భాలు కోకొల్ల‌లు. ఇప్ప‌టికే బాలీవుడ్ లో చాలా మంది ప్ర‌ముఖుల‌పై కౌంట‌ర్ ఎటాక్ చేసి చుక్క‌లు చూపించింది. తాజాగా ఈసారి ఏకంగా మ‌హరాష్ట్ర‌ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేపైనే ఎటాక్ కి దిగింది. క‌రోనా త‌గ్గుమ‌ఖం ప‌ట్టిన నేప‌థ్యంలో అన్ని రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు థియేట‌ర్లు రీ ఓపెన్ కి అనుమ‌తులిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే మ‌హ‌రాష్ట్ర‌లో మాత్రం సీన్ మ‌రోలా ఉంది.

అక్క‌డ రెండ‌వ వేవ్ దెబ్బ‌కు బెంబేలెత్తిన ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌కు పూర్తి స్థాయిలో  అన్ లాక్ కి ఇంకా అనుమ‌తులివ్వ‌లేదు. కొన్ని ఏరియాల్లో థియేట‌ర్లు ఓపెన్ అయ్యాయి త‌ప్ప‌...రాష్ట్ర‌ వ్యాప్తంగా సంపూర్ణంగా తెర‌వ‌లేదు. దీనికి కార‌ణం సీఎం ఉద్దేవ్ ఠాక్రే అంటూ కంగన క‌న్నెర్ర జేసింది. అన్ని రాష్ట్రాల్లో థియేట‌ర్లు  ఓపెన్ కి అక్క‌డి ప్ర‌భుత్వాలు అనుమ‌తులిచ్చాయి?  మీకేమైందంటూ ప్ర‌శ్నించారు. థియేట‌ర్ల‌ను పూర్తిగా మూసేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారా? అన్ని సంధించారు. సినీ రంగంపై స‌ర్కారు చూపిస్తోన్న వివ‌క్ష అని మండిప‌డింది చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి కూడా ఎవ‌రూ అడ‌గ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆయ‌న ఇలా చేస్తున్నారంటూ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసింది.

ఎన్నో సినిమాలు అన్ని ప‌నులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. వాళ్లంతా న‌ష్ట‌పోవాల్సిందేనా? అని కంగ‌న చిరుబుర్రులాడారు. కంగ‌న న‌టించిన ` త‌లైవి` ఇటీవ‌ల విడుద‌లైన నేప‌థ్యంలో రిలీజ్ ని ఠాక్రే ప్ర‌భుత్వం తోసిపుచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో కంగ‌న ప్ర‌తీకారాన్ని  ఇలా తీర్చుకుందా? అని బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. కోవిడ్ సెకెండ్ వేవ్ లో ముంబైలో ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయో తెలిసిందే. అక్క‌డ భారీగా ప్రాణ న‌ష్టం జ‌రిగింది. ఆ కార‌ణంగా అక్క‌డి ప్ర‌భుత్వం  వేటికి త్వ‌ర‌గా అనుమ‌తులివ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో కంగ‌న వ్యాఖ్య‌ల్ని కొంద‌రు స‌మ‌ర్ధించ‌గా మెజార్టీ వ‌ర్గం ఆమెనే త‌ప్పు బ‌ట్టింది. ప్ర‌జ‌ల ప్రాణాలు ముఖ్యామా?  థియేట‌ర్లు తెరిచి వాళ్ల ప్ర‌ణాల్ని రిస్క్ లో పెట్టడం ముఖ్యామా? అని మండిప‌డుతున్నారు.
Tags:    

Similar News