కెరీర్ నాశనం చేసేందుకు ప్రయత్నించాడు

Update: 2017-02-05 20:22 GMT
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నానుతూనే ఉంటుంది. అటు సినిమాల పరంగా ట్యాలెంట్ చూపించడంతోనో.. లేకపోతే డేరింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడంలో.. కంగనాను మించిన హీరోయిన్ మరొకరు కనిపించరు. వీటితో పాటు గతేడాది హృతిక్ రోషన్-కంగనల మధ్య పెద్ద యుద్ధమే జరిగిన సంగతి తెలిసిందే.

'సిల్లీ ఎక్స్' అంటూ హృతిక్ ని ఉద్దేశించి కంగనా కామెంట్ చేసిన దగ్గర మొదలైన వివాదం.. ఈ మెయిల్స్ బయటపెట్టుకోవడం.. లీగల్ నోటీసుల వరకూ వెళ్లింది. ఈ విషయంలో ఎక్కువగా హృతిక్ సైలెంట్ గానే ఉన్నా.. కంగనా మాత్రం బాగానే నోరు పారేసుకుంది. కొన్ని నెలలుగా సద్దుమణిగినట్లు అనిపించిన ఈ వివాదాన్ని.. మరోసారి రాజేసింది కంగనా. తన కెరీర్ ను నాశనం చేసేందుకు హృతిక్ రోషన్ ప్రయత్నించాడంటూ నేరుగానే స్టేట్ మెంట్ ఇచ్చేసిం సంచలనం సృష్టించింది రంగూన్ బ్యూటీ.

'నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలతో తమను కలిశాడంటూ.. చాలామంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి.. వాస్తవాలు అడిగారు. నేను ఎవరికీ ఎక్స్ ప్లనేషన్ ఇచ్చేందుకు ప్రయత్నించలేదు. నిర్దాక్షిణ్యంగా నా కెరీర్ నాశనం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు హృతిక్. వేరే వ్యక్తి అంటూ ఎవరినో లాక్కొచ్చినపుడు.. అతనితో క్లారిటీ ఇప్పించాల్సింది పోయి.. నన్నే సారీ చెప్పమంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే.. ఆ వేరే వ్యక్తి కూడా ఎవరో కాదు.. హృతిక్ రోషనే' అని తేల్చేసింది కంగనా.

అంతే కాదు.. హృతిక్ రోషన్ కు కంగనా ఈమెయిల్ నుంచి 1439 మెయిల్స్ వెళ్లాయనే విషయాన్ని ప్రస్తావిస్తే.. 'అలాంటి చెత్త నేను రాయను. నేను న్యూయార్క్ ఫిలిం అకాడమీ నుంచి సర్టిఫైడ్ స్క్రీన్ రైటర్ ని' అని చెప్పింది కంగనా రనౌత్. మరిప్పుడు మళ్లీ రగిలిన ఈ వివాదంపై హృతిక్ స్పందన ఏంటో తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News