కొన్ని నెలలు నుండి బాలీవుడ్ ఇండస్ట్రి లో స్టార్స్ కిడ్స్ పై ఉన్న పక్షపాతం.. కొత్తవారి అవకాశాలును హరిస్తున్న బంధుప్రీతిపై (నెపోటిజం) తీవ్రంగా చర్చలు సమావేశాలు జరుతున్నాయి. కరణ్ కొహార్ కాఫి విత్ కరణ్ టాక్ షో లో కంగనా రనౌత్ ఈ పక్షపాత ధోరణి - బంధుప్రీతి చాలా ఎక్కువ ఉందని అందువలనే నాలాంటి వారు పైకి రాలేకపోతున్నారు అని చెప్పడంతో చర్చ మళ్ళీ మొదలైంది. ఆ తర్వాత కరణ్ జోహర్ దీనిపై కొన్ని పబ్లిక్ షో లలో మాట్లాడి.. కంగన ఓవర్ రియాక్ట్ అవుతుందంటూ కామెంట్ చేశాడు. ఇకపోతే ఇప్పుడు మన క్వీన్ అనుపమ్ ఖేర్ హోస్ట్ గా చేస్తున్న ఒక టాక్ షో లో బాలీవుడ్ నెపోటిజం గురించి మళ్ళీ కామెంట్ చేసింది.
అనుపమ్ ఖేర్ ఇంటర్వ్యూ లో భాగంగా.. 'ఇప్పుడు చాలా నెగిటివ్ టాక్ వస్తుంది నీ పైన. అది ఏమైనా నీ పని మీద ప్రభావం చూపిందా' అని అడిగితే బాలీవుడ్ క్వీన్ సమాధానం ఇలా ఉంది. “ఇప్పుడు జరిగే చర్చలు నా పని పై ఎటువంటి ప్రభావం చూపలేవు. నాకు జరిగింది నేను చెప్పాను అందులో తప్పేం లేదు. పరిశ్రమ ఎప్పటి నుంచో ఇలానే చేస్తుంది. స్టార్ కిడ్స్ పై పెట్టిన శ్రద్ధ నాలాంటి బయట వాళ్ళపై చూపదు. నేను 10 ఏళ్ళు చాల కష్టపడి ఈ స్థాయి కి చేరుకొన్నాను. నేను ఇలా ఎందుకు మాట్లాడతానో నాతో ప్రయాణం చేసిన వారిని అడిగితే తెలుస్తుంది మీకు నేను ఇప్పుడు ఉన్న స్థితికి రావడానికి ఎందరని ఎదిరించి వచ్చాను అనేది. నా జీవితం అసాధారణమైనది నేను ఒక అసాధారణమైనమనిషిని'' అని చెప్పింది. కంగనా మొదటిసారి నెపోటిజం గురించి మాటలాడినప్పుడు ధర్మా ప్రొడక్షన్ వాళ్ళు ఒక బ్లాగ్ లో దానిని సమర్ధించుకుంటూ రాసిన పోస్టుపై కూడా కంగనా కామెంట్ చేసింది “ఆ బ్లాగ్ చూశాను దానిలో సమస్య గురించి చర్చ కన్నా దాన్ని సమర్ధించుకోవడం గురించి ఎక్కువ ఉంది'' అని తీసిపారేసింది.
సినిమా విషయానికొస్తే.. ఇప్పుడు హంసల్ మెహతా డైరెక్ట్ చేస్తున్న సిమ్రాన్.. కంగన తదుపరి సినిమా. మరో సినిమా క్రిష్ డైరెక్ట్ చేస్తున్న మనికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ లో కూడా నటిస్తుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/