బాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ అంటే అందరికి ముందు గుర్తొచ్చేది క్వీన్ కంగనా రనౌత్ మాత్రమే. ఇంటి నుంచి వచ్చేసి ముంబై లో ఎన్నో కష్టాలుపడి తిండి లేని రాత్రులు గడిపిన కంగన ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతోంది. అంతేకాదు కొన్ని కథలకి కంగన తప్ప మరెవరూ సెట్ అవ్వరు అన్నంతగా క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా బాలీవుడ్ లో చలామణి అవుతున్న కంగనా తలైవి జయలలిత బయోపిక్ లో నటిస్తుంది. ఇక ఎప్పుడు అవతల వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే, లేదా మాట్లాడితే అందరికంటే ముందు స్పందించే కంగనా చాలా కాలానికి తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయట పెట్టింది. కొంతమంది హీరోల సరసన సినిమాల్లో నటించడానికి ఎంత మాత్రం ఒప్పుకోదట.
తనకు స్వతంత్ర భావాలు ఉన్నాయని, నచ్చని పాత్రని చేయమని ఒత్తిడి చేసినా ఒప్పుకోనని, ఓ స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఫోన్ చేసి ఇచ్చిన ఆఫర్‌ను మొహమాటం లేకుండా తిరస్కరించినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్, రణ్‌బీర్ కపూర్ నటించిన సంజూ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. అయితే ఎలాంటి మొహమాటం లేకుండా ఈ సినిమాలను రిజెక్ట్ చేశాను. సంజూ సినిమాలో నా రేంజ్ కు తగిన పాత్ర లేకపోవడం వల్ల నేను ఒప్పుకోలేదని, రణబీర్ కపూర్ స్వయంగా అడిగినా తిరస్కరించానని కంగన రనౌత్ చెప్పారు. సుల్తాన్ సినిమాలో అనుష్క శర్మకు బదులుగా నన్నే అడిగారు. ఆదిత్య చోప్రా నాకు ఫోన్ కాల్ చేసి ఆఫర్ ఇచ్చారు. నేను చేయనని చెప్పాను. దాంతో నీతో జీవితంలో కలిసి పనిచేయనని చెప్పాడు. అయితే సరే అని ఫోన్ పెట్టేశాను. ఇలాంటి విషయాలు నా కెరీర్ లో చాలానే జరిగాయి అని కంగనా అన్నారు. ఇది తెలిసిన కొంతమంది కంగనాకు మరీ ఇంత పనికిరాదని అంటుంటే, మరికొందరు ఈ రోజుల్లో ఇలా స్వతంత్ర భావాలతో జీవించే వాళ్ళు ఎంత మంది ఉంటారని పొగుడుతున్నారు.