హృతిక్ రోషన్.. కంగనా రనౌత్ ల మధ్య వివాదం ఓ పట్టాన ముగిసేటట్లుగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ వివాదంపై దాదాపుగా ఇరు వర్గాలు సైలెంట్ అయినా.. అప్పట్లో హృతిక్ రోషన్ ఇచ్చిన ఓ ఫిర్యాదును బేస్ చేసుకుని.. తాజాగా ఓ న్యూస్ ఛానల్ ఈ విషయాన్ని మళ్లీ కదిలించింది. దీంతో మరోసారి హాట్ టాపిక్ గా మారిన హృతిక్-కంగనాల వ్యవహారం.. జనాల్లో మళ్లీ నానుతోంది.
తనను కంగనా వెంటాడిందని.. వేధింపులకు గురి చేసిందని.. ప్రేమించమంటూ ఒత్తిడి చేసిందని ఆ లేఖలో ఫిర్యాదు చేశాడు హృతిక్. తాజాగా ఈ విషయంపై కంగనా సోదరి రంగోలి.. సోషల్ మీడియా సాక్షిగా స్పందించింది. ఆమె హృతిక్ పై ఘాటు విమర్శలే చేసింది. "నిన్ను నువ్వు కాపాడుకోవడం.. నీ మొహం దాచుకునేందుకు ఇంతకంటే ఏం చేయగలవులే.. నోటికొచ్చినట్లు విమర్శలు చేయడం.. ఆధారంలేని ఫిర్యాదులు ఇవ్వడమే నువ్వు చేయగలవు. నీ మొదటి సినిమా రిలీజ్ అయినపుడు.. కంగనా ఓ స్కూల్ విద్యార్ధి. ఒకవేళ తాను ఇండస్ట్రీలో లేకపోతే.. నువ్వు తనకు అంకుల్ అయ్యేవాడివి" అని చెప్పింది రంగోలి.
"ప్రతిభావంతురాలు అయిన.. సంపన్నపరురాలు అయిన కంగనకు నీలాంటి అంకుల్ వెంట పడాల్సిన అవసరం లేదు. నువ్వే తన వెంటపడి వేధించావ్. ఎవరు ఇలాంటి వేధింపులకు గురి చేస్తారో అందరికీ తెలుసు. కంగనా ఈ విషయం నుంచి బైటకు వచ్చేసింది. డియర్ స్టాకర్.. నువ్వు నీ భార్యాపిల్లలపై దృష్టి పెట్టు"అంటూ నేరుగానే విమర్శించింది రంగోలి.