ఈ క‌థ దేశం మొత్తం తెలుసుకోవాలి: ర‌ంగోలి

Update: 2019-12-11 03:48 GMT
దీపీకా ప‌దుకోన్ న‌టిస్తున్న చిత్రం `ఛ‌పాక్‌`. యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ జీవితంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో మేఘ‌నా గుల్జార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజైంది. ఇందులో యాసిడ్ బాధితురాలిగా దీపిక క‌నిపించింది. మాల‌తి పాత్ర‌లో ఆమె ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న‌కు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ప్ర‌తి విష‌యాన్ని కాంట్ర వ‌ర్శీ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించే కంగ‌న సిస్ట‌ర్ రంగోలి చందేల్ ఈ ట్రైల‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ట్విట్ట‌ర్ వేదిక‌గా రంగోలి దీపిక‌పై, ఛ‌పాక్ ట్రైల‌ర్‌పై ప్ర‌శంస‌ల వర్షం కురిపించింది.

`అద్భుతం ప్ర‌తీ ఒక్క‌రు చూడాల్సిన చిత్ర‌మిది. చాలా అద్భుతంగా వుంది. మేఘ‌నా గుల్జార్‌, దీపికా ప‌దుకోన్ ఈ సినిమా ద్వారా చాలా మంది భావోద్వేగపూరిత‌మైన ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంటారు. నాపై జ‌రిగిన యాసిడ్ దాడి కార‌ణంగా నేను, నా కుటుంబం మ‌ర‌ణం క‌న్నా ఘోర‌మైన బాధ‌ను అనుభ‌వించాం. యాసిడ్ దాడి త‌రువాత ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన వారి క‌థ ఈ దేశం మొత్తం తెలుసుకోవాలి. ఈ దేశంలో అంద‌రికి చేరాలని ప్రార్థిస్తున్నాను` అని రంగోలి చందేల్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా `ఛ‌పాక్‌` చిత్రానికి అండ‌గా నిల‌బ‌డ‌టం ప‌లువురు బాలీవుడ్ తారల‌ను విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది.

ఎలాంటి సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చినా అందులో కంగ‌న‌న‌ను ఊహించుకుని ఆ పాత్ర‌లో న‌టించిన వారిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించే రంగోలి `ఛ‌పాక్‌` చిత్రంపై మాత్రం త‌న పంథాకు భిన్నంగా స్పందించ‌డం ఒకింత ఆశ్చ‌ర్య‌మే. అయితే గ‌తంలో రంగోలి చందేల్ యాసిడ్ దాడికి గురైంది. ఆ కార‌ణంగానే ఆమె దీపిక‌లో త‌న‌ని తాను చూసుకుంటోంది కాబ‌ట్టే ఈ చిత్రానికి స్వ‌చ్ఛందంగా ప్ర‌చారం చేస్తోంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News