బాలీవుడ్ క్వీన్ కింగనా రనౌత్ తాజా చిత్రం 'మెంటల్ హై క్యా' ముందు అనుకున్న రిలీజ్ షెడ్యూల్ ప్రకారం జూన్ లో కాకుండా జూలై 26 కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. సాధారణంగా అయితే ఈ రిలీజ్ డేట్ మార్పు పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే అదే డేట్ కు హృతిక్ రోషన్ 'సూపర్ 30' కూడా రిలీజ్ అవుతోంది. దీంతో కంగనా ఉద్దేశపూర్వకంగా హృతిక్ సినిమాకు పోటీకి వెళ్తోందని విమర్శలు మొదలయ్యాయి.
అయితే 'మెంటల్ హై క్యా' నిర్మాత ఏక్తా కపూర్ ఈ రిలీజ్ డేట్ మార్పుతో కంగనాకు సంబంధం లేదని.. ఇది నిర్మాతలుగా తాము తీసుకున్న నిర్ణయమని క్లారిటీ ఇచ్చింది. ఏవైనా విమర్శలు ఉంటే తనను విమర్శించాలని కంగనాను విమర్శించవద్దని కోరింది. పోటీని ఆరోగ్యకరంగా ఉంచుదామని.. బురద చల్లుకోవడం వద్దని కూడా కోరింది. అయితే విమర్శలు మాత్రం ఆగలేదు. నిన్న రాత్రి ఆమె చేసిన ట్వీ ట్ లో "అసహ్యకరమైన అండర్ గ్రౌండ్ ట్వీట్లు మొదలయ్యాయి. ఈ పోటీని ఆరోగ్యకరంగా ఉంచుదామని నా సినిమా యాక్టర్లను ఇందులో ఇన్వాల్వ్ కావద్దని కూడా కోరాను. దయచేసి పర్సనల్ గా దాడి చేయడం ఆపండి. అది నా నిర్ణయం" అంటూ కంగనా కు దీంతో సంబంధం లేదని చెప్పారు .
ఇక కంగనా సోదరి రంగోలి రంగంలోకి దిగింది.ట్వీట్ల వర్షం కురిపించింది.
"డైరెక్ట్ గా యుద్ధరంగం లో విషయం తేల్చుకోకుండా వెన్నుపోటు పొడిచే మగాడి నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తాం? మీరు.. మీ పీ ఆర్ టీమ్ కంగనాను ఎంత దిగాజార్చాలని చూస్తారో కంగనా మిమ్మల్ని అంతకంటే కిందకు తొక్కేస్తుంది. ఇప్పటి వరకూ కంగానా పట్టించుకోలేదు అంతే."
"నువ్వు నీ చిల్లర పీఆర్ లతో ట్వీట్స్ చేయిస్తూ ఉండు.. కంగన జస్ట్ ఒక ఇంటర్వ్యూ ఇస్తుంది.. నీ పని ఖతం."
"బాలాజీ టెలి ఫిలిమ్స్ ఏమైనా కంగనా సొంత నిర్మాణ సంస్థా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ డేట్ మార్చుకోవడానికి. పప్పు ఎప్పుడు పప్పే. కామన్ సెన్స్ ఉంటె కదా(నీకు). అబ్బాయ్.. ఇక చూడు నీపని ఏమవుతుందో."
"నిజానికి 'మెంటల్ హై క్యా' ను జులై 26 న రిలీజ్ చేయవద్దని కంగనా నిర్మాత ఏక్తా ను కోరింది. కానీ ఏక్తా నిర్మాతగా అది తమ నిర్ణయం అని చెప్పి డిసైడ్ చేసింది. ఆ తర్వాత ఏక్తా తన చిన్ననాటి స్నేహితుడు అయిన హృతిక్ తో ఒక సారి సమావేశం అయింది. తన స్నేహితురాలు కావడంతో హృతిక్ ఏమీ అనలేక 'సరే' అన్నాడు. ఇప్పుడు కంగనా ను పంచింగ్ బ్యాగ్ చేయాలని చూస్తున్నాడు. అది పొరపాటు అభిప్రాయం. నువ్వు కానీ.. నీ పీఆర్ ప్రభాత్ కానీ కంగనా పై బురద చల్లడం మొదలు పెడితే కంగానా మీ దుమ్ము దులపడం ఖాయం."
ఇవన్నీ నిన్నటి ట్వీట్లు. తాజాగా "అందరికీ మర్యాదపూర్వకంగా నేను చెప్పేదేంటంటే..ఒకవేళ 'సూపర్ 30' టీమ్ కంగనా జోలికి రాకుండా.. ట్రోల్ చేయకుండా.. విమర్శించకుండా ఉంటే కంగనా ఈ విషయంపై ఒక్క ముక్క కూడా మాట్లాడదు. #శాంతి.