కంగనా రనౌత్ కి ఎంత ట్యాలెంట్ ఉందో అంత నోటి దురుసు కూడా ఉందనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పని ఉండదు. అడక్కపోతేనే అరడజన్ విమర్శలతో రెచ్చిపోయే ఈ బాలీవుడ్ క్వీన్.. ఏదైనా టాపిక్ పై అడిగితే మాత్రం చెలరేగిపోతుంది.
రీసెంట్ గా నేహాధూపియా నిర్వహిస్తున్న 'నో ఫిల్టర్ నేహ' కార్యక్రమానికి వచ్చిన కంగనా.. తోటి స్టార్లపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేసింది. వీటిలో ప్రధానంగా అయితే హృతిక్ రోషన్ పై చేసిన కామెంట్స్ నే మొదట చెప్పుకోవాలి. బెస్ట్ అవార్డ్ ఎవరికి ఇస్తారంటే.. 'పోన్లే.. వాళ్లకు ఫేమస్ తల్లిదండ్రులున్నారు. లేకపోతే ఎక్కుడుండే వాళ్లో' అని ఓ క్షణం ఆగి.. 'కరెక్టే.. హృతిక్ రోషన్. మీకు నిజం తెలుసుగా' అనేసిందీ బ్యూటీ. కొన్ని నెలల క్రితం హృతిక్ పై చేసిన కామెంట్స్ దెబ్బకి.. కోర్టు కేసుల వరకూ వెళ్లి.. ఆనక తీరిగ్గా సైలెంట్ అయిన కంగనా.. మళ్లీ ఇప్పుడు డైరెక్టుగా ఈ రేంజ్ విమర్శలు చేయడం గమనించాలి.
ఇక ఇండియన్ యాక్ట్రెస్ ల రేంజ్ ని ఇంటర్నేషనల్ కి తీసుకెళ్లిన ప్రియాంక చోప్రాకు ఎలాంటి అవార్డ్ ఇస్తావ్ కంగనా అంటే.. 'ప్రపంచంలో అత్యుత్తమమైన దొంగ నవ్వు అవార్డ్ ఉంటే అది ప్రియాంకకే' అంటోంది కంగనా. ఒకే షోలో ఇద్దరు టాప్ స్టార్స్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు చాలానే గట్స్ ఉండాలి కదూ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/