మరోసారి విషం కక్కిన స్టార్‌ హీరోయిన్‌

Update: 2022-02-13 15:30 GMT
కంగనా రనౌత్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ అయినా కూడా సౌత్‌ లో మోస్ట్‌ పాపులర్‌ స్టార్‌ అనడంలో సందేహం లేదు. ఆమె సినిమాలతో పాటు ఎప్పటికప్పుడు వివాదాలతో కూడా ఫేమస్ అవుతుంది. తాజాగా ఈ అమ్మడు మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఎక్కువగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ పై విమర్శలు చేస్తూ ఉండే కంగనా రనౌత్‌ ఈసారి ఇండైరెక్ట్‌ గా దీపిక పదుకునే పేరు ఎత్తకుండా ఆమె నటించిన తాజా చిత్రం గెహ్రైయాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

 దీపిక పదుకునే సినిమా విడుదల అయ్యి నెగటివ్ టాక్ దక్కించుకున్న నేపథ్యంలో కంగనా చేసిన వ్యాఖ్యలు ఆ సినిమా గురించే అనే టాక్ వినిపిస్తుంది. గతంలో కూడా కంగనా ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.

గెహ్రైయాన్ సినిమా లో కాస్త రొమాన్స్ ఎక్కువ అయ్యింది. అయినా కూడా సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ఇక కంగనా వ్యాఖ్యల విషయానికి వస్తే ఇన్ స్టా గ్రామ్‌ లో.. నేను కూడా ఈ జనరేషన్ కు చెందిన దానినే కాని నాకు ఈ తరహా శృంగారం అర్థం కాలేదు. న్యూ ఏజ్ సినిమాల పేరుతో చెత్త సినిమాలను అమ్మకండి ప్లీజ్.

బూతు కంటెంట్ పోర్నోగ్రఫీ చెత్త సినిమాలను కాపాడలేవు అనేది ఒక ప్రాధమిక సూత్రం. ఆ మాత్రం ఆ సినిమాను తెరకెక్కించిన వారికి తెలియదా అంటూ కంగనా చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. కంగనా అభిమానులు ఆమె పోస్ట్‌ ను డైరెక్ట్‌ గా దీపిక పదుకునే పేరు పెట్టి కంగనా పోస్ట్‌ ను షేర్‌ చేస్తుంటే మరి కొందరు మాత్రం కంగనా తీరును తప్పుబడుతున్నారు.

ప్రతి ఒక్కరు కూడా తమ తమ సినిమాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి.. ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అనే ఉద్దేశ్యంతోనే సినిమాలు చేస్తారు. కాని సినిమా ఫలితాలు తారు మారు అవ్వడం మనం చూస్తూ ఉంటాం.

 అంత మాత్రాన బూతు కంటెంట్‌ సినిమా సక్సెస్ కు ఉపయోగపడదు అని.. పెద్ద హీరోయిన్స్ సినిమాల విషయాల్లో విమర్శలు చేయడం ఏమాత్రం సబబు కాదు. కంగనా రనౌత్‌ మళ్లీ మళ్లీ తనకు లైఫ్‌ ను ఇస్తున్న ఇండస్ట్రీకి చెందిన సినిమాలపైనే విమర్శలు చేయడం విజ్ఞత అనిపించుకోదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

కంగనా రనౌత్‌ గతంలో ఆలియా భట్‌ సినిమాలపై కూడా విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఇతర హీరోయిన్స్ కు అవార్డులు వచ్చినా కూడా కంగనా విమర్శలు చేస్తుంది. ఆమె ప్రతి ఒక్క హీరోయిన్ పై అసూయతో ఉంటుంది. తాను మాత్రమే ప్రతిభావంతురాలిని అనే ఉద్దేశ్యంతో ఉంటుందంటూ సినీ వర్గాల వారు మరియు కొందరు మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News