ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన కంగ‌నా!

Update: 2018-08-11 11:20 GMT
బాలీవుడ్ లోని హీరోయిన్ల‌లో కంగనా రనౌత్ తీరే వేరు. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడేయ‌డం...కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్ప‌డం ఈ ఫైర్ బ్రాండ్ కు అల‌వాటు. సినిమాలైనా...రాజ‌కీయాలైనా....కంగ‌నా...కామెంట్స్ చాలా ఘాటుగా ఉంటాయి. అదే త‌ర‌హాలో కంగ‌నా ...ప్ర‌ధాని మోదీపై కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్య‌లు ఇపుడు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్రజాస్వామ్య దేశం భార‌త్ కు ప్రధానిగా నరేంద్ర మోదీ స‌రైన వ్య‌క్త‌ని - ఆయ‌న మ‌రో ఐదేళ్లు పాలించే అవకాశమిస్తేనే దేశాన్ని మార్చగలడు అని కామెంట్స్ చేసింది. అంతేకాకుండా, మోదీకి ఆ ప‌ద‌వి వారసత్వంగా రాలేదని - కష్టపడి సాధించుకున్నారని ప్ర‌శంసించింది. దీంతో, కంగ‌నా...త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌బోతోందంటూ....సోష‌ల్ మీడియాలో కామెంట్స్ మొద‌ల‌య్యాయి. మోదీని పొగిడిన కంగ‌నాను కొంద‌రు నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తే....మ‌రికొంద‌రు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా త‌న రాజ‌కీయ పుకార్ల‌పై కంగ‌నా క్లారిటీ ఇచ్చింది.

త‌న‌కు రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేద‌ని కంగ‌నా స్ప‌ష్టం చేసింది. త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై వ‌స్తున్న పుకార్ల‌ను కంగ‌నా ఖండించింది.తాను ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటూ ఆనందంగా ఉన్నాన‌ని చెప్పింది. ప్రజాసేన చేయాలంటే రాజకీయాల్లోకే రావాల్సిన అవ‌స‌రం లేద‌ని త‌న మాతృభూమికి  ఏదైనా సేవ  చేయాలనుకుంటే రాజకీయాలు ఒక్క‌టే మార్గం కాద‌ని స్ప‌ష్టం చేసింది. తమకు కరెంట్ - నీటి కొరత లేవని... కాబ‌ట్టి ప్రజా సమస్యలపై స్పందించ‌బోమ‌ని త‌న‌తో కొంద‌రు న‌టీన‌టులు అన్నార‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నోరు విప్పకపోతే సినీన‌టులు సాధించిన విజయాలకు అర్థం లేద‌ని చెప్పింది. ఆ త‌ర‌హా వ్యాఖ్య‌లు వినగానే చాలా బాధేసింద‌ని - త‌మ‌కు స్టార్ డమ్ ఇచ్చిన ప్రజల సమస్యలపై మాట్లాడక‌పోవ‌డం దారుణమ‌ని తెలిపింది.

Tags:    

Similar News