బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా కంగనా రనౌత్ కు పేరు ఉంది. ఆమెలో గొప్ప నటి ఉందని ఇప్పటికే ఆమె నటించిన సినిమా నిరూపించాయి. నటిగా ఆమె ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించినా కూడా ఆమెపై కొన్ని సార్లు విమర్శలు వస్తూనే ఉంటాయి. కంగనాకు పొగరని, ఆమె పెద్దలను గౌరవించదని, సినిమాల మేకింగ్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి, దర్శకులకు స్వేచ్చ ఇవ్వదనే విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. తాజాగా ‘మణికర్ణిక’ చిత్రం విషయంలో కూడా కంగనా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెల్సిందే. ఆ సినిమా నుండి తెలుగు దర్శకుడు క్రిష్ ను గెంటేసి - తానే స్వయంగా సినిమాను తెరకెక్కించింది. ఆ విషయంలో తెలుగు వారు కంగనాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. అయితే తెలుగు వారిని కూల్ చేయడంతో పాటు తన పద్దతిని తెలియజెప్పేలా కంగనా రనౌత్ తాజాగా తెలుగు రచయిత విజయేంద్ర ప్రసాద్ పాదాలు తాకి మరీ ఆయనకు నమస్కరించింది.
‘మణికర్ణిక’ చిత్రంకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన విషయం తెల్సిందే. అందరికి తెలిసిన కథే అయినా కూడా విజయేంద్ర ప్రసాద్ సినిమాటిక్ గా అద్బుతంగా కథను మలిచాడట. తానే గొప్ప, తనకంటే ప్రతిభవంతులు లేరని భావిస్తుందని కంగనాపై విమర్శలు ఉన్నాయి. అలాంటి కంగనా ‘మణికర్ణిక’ కు అద్బుతమైన కథను ఇచ్చినందుకు గాను విజయేంద్ర ప్రసాద్ పాదాలకు నమస్కరించి మరీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ఆశీర్వాదం తీసుకుంది.
తాజాగా ముంబయిలో జరిగిన ‘మణికర్ణిక’ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కంగనా ఇలా జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ పాదాలకు నమస్కరించింది. బాహుబలితో పాటు పలు బాలీవుడ్ సినిమాలకు కథను అందించి ఇండియాస్ నెం.1 రైటర్ గా పేరు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ ను కంగనా గౌరవించి తెలుగు వారి హృదయాల్లో మంచి అభిప్రాయం ఏర్పడేలా చేసింది. ‘మణికర్ణిక’ చిత్రం వచ్చే నెలలో రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంకు క్రిష్ తో పాటు తన పేరును కూడా డైరెక్టర్ గా కంగనా వేసుకుంది.