బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వరుసగా ప్లాప్ లను చవిచూస్తూ ఉన్నా కూడా ఏమాత్రం తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూనే ఉంది. మొన్నటికి మొన్న ధాకడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగనా అత్యంత దారుణమైన వసూళ్లను దక్కించుకుంది. ఆ సినిమా వసూళ్లు మరీ అంత తక్కువగా ఉంటాయని ఏ ఒక్కరు ఊహించి ఉండరు.
ధాకడ్ వసూళ్లను చూసి కంగనా యాంటీ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారట అంటే ఏ స్థాయిలో ఆ సినిమా వసూళ్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ గా కంగనా రనౌత్ అయినా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి ఇందిరా గాంధీ బయోపిక్ గా వార్తలు వస్తున్నాయి.
కంగనా రనౌత్ మరో వైపు మధు బండార్కర్ దర్శకత్వంలో ఒక సినిమా ను చేసేందుకు ఓకే చెప్పింది. ప్రస్తుతం తమన్నా తో ఒక సినిమాను చేసి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న దర్శకుడు మదుర్ బండార్కర్ త్వరలోనే కంగనా రనౌత్ తో సినిమాను చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందట.
కశ్మీరీ అమ్మాయి పాత్రలో కంగనా ను దర్శకుడు మదుర్ బండార్కర్ చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక సాదారణ కశ్మీరీ పండిట్ అమ్మాయి ఉగ్రవాదులతో పోరాడిన విధానంను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కశ్మీర్ నేపథ్యంలో వచ్చిన కశ్మీర్ ఫైల్స్ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే.
ఇప్పుడు అదే బ్యాక్ డ్రాప్ తో కంగనా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా.. కాశ్మీరి మిలిటెంట్ల తీరుకు వ్యతిరేకంగా ఒక భారీ లేడీ ఓరియంట్ సినిమాను కంగనా చేసేందుకు గాను సైన్ చేసింది.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఈ సినిమాను నిర్మించేందుకు రెడీ గా ఉంది. త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించి వచ్చే ఏడాదికి కంగనా మార్క్ కశ్మీర్ ఫైల్స్ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.