హోంమంత్రిపై కంగన సంచలన వ్యాఖ్యలు

Update: 2021-04-06 03:37 GMT
మహారాష్ట్ర హోంమంత్రి  అనిల్ దేశ్ ముఖ్ పై ముంబై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసేశాడు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా సంచలనమైంది.

ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరంబీర్ సింగ్ దేశ్ ముఖ్ మీద చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశించింది. 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ నిర్వహించాలని హైకోర్టు కేంద్ర ఏజెన్సీని ఆదేశించింది.

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేసినట్లు ఎన్సీపీ మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. అయితే ఈ వివాదాన్ని బీజేపీ సహా వ్యతిరేకులు అందిపుచ్చుకొని మహారాష్ట్రలోని శివసేన-ఎన్సీపీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు.

తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘స్త్రీలను వేదించి.. హింసించే వారికి ఎప్పటికైనా పతనం తప్పదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.  ముందు ముందు భవిష్యత్తులో చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.

కంగనా ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీస్తున్నాయి. కాగా.. గతంలో కంగనాకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా కంగనా టార్గెట్ చేసింది.
Tags:    

Similar News