ఫోర్బ్స్ వాళ్ల‌ కే చెమ‌ట‌లు ప‌ట్టించేస్తోంది!

Update: 2019-12-30 08:54 GMT
సెల‌బ్రిటీ ల అనుమ‌తి లేకుండా వారి సంపాద‌న‌ల‌పై జాబితాని రూపొందించి రిలీజ్ చేసేస్తే దాని ప‌ర్య‌వ‌సానం ఎలా ఉంటుందో ఇన్నాళ్టికి ఫోర్బ్స్ వాళ్ల‌కు తెలిసొస్తోంది. అది కూడా క్వీన్ కంగన సోద‌రి రంగోలి వ‌ల్ల పూర్తి క్లారిటీ వ‌స్తోంది. ఇన్నాళ్లు కొలీగ్స్ పైనే ఏదో ఒక షాక్ తో కాలు దువ్విన ఈ సిస్ట‌ర్స్ ఇప్పుడు ఏకంగా ఫోర్బ్స్ కార్పొరెట్ పైనే లీగ‌ల్ బ్యాటిల్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇటీవ‌లే ఫోర్బ్స్ రిలీజ్ చేసిన జాబితా లో కంగ‌న 70వ ర్యాంక్ సాధించింది. ఈ ఏడాది లో 17.5 కోట్ల సంపాద‌న‌ తో ఆ స్థానాన్ని అందుకుంద‌ని ఫోర్బ్స్ పేర్కొంది. అయితే ఇది నిజం కాదు.. నా సోద‌రిని ఫోర్బ్స్ త‌క్కువ చేసి చూపించింది... స‌ద‌రు కంపెనీ పై చ‌ట్ట‌ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని రంగోలి ఫైర్ అయిన‌ సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కంగ‌న సిస్ట‌ర్స్ అన్నంత ప‌నీ చేస్తున్నారు. తాజాగా ఫోర్బ్స్ ప‌త్రిక‌కు రంగోలి లీగ‌ల్ నోటీసులు పంపించింది. అయితే దానికి స‌ద‌రు ప‌త్రిక యాజ‌మాన్యం స్పందించ‌డం లేద‌ట‌. అస‌లింత‌కీ రంగోలి వాద‌న ఏమిటి? అంటే.. కంగ‌న ర్యాంకును త‌క్కువ చేసి చూపిస్తారా? 17.5 కోట్ల సంపాద‌న కాదు.. అంత మొత్తం ట్యాక్స్ క‌ట్టింద‌న్న‌ది త‌న‌ వాద‌న‌.

మొత్తానికి ప్ర‌పంచ విఖ్యాత కార్పొరెట్ కే కంగ‌న‌- రంగోలి సిస్ట‌ర్స్ చెమ‌ట‌లు ప‌ట్టించేస్తున్నారు. ఇక కంగ‌న త‌దుప‌రి వ‌రుస‌గా భారీ చిత్రాల్లో న‌టిస్తోంది. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ప్ర‌స్తుతం మంచు కొండ‌ల విహారంలో రిలాక్స్ అవుతున్న క్వీన్ ఈ టూర్ అనంత‌రం తిరిగి ఒక్కో ప్రాజెక్టును పూర్తి చేయ‌నుంది. అమ్మ జ‌య‌ల‌లిత బ‌యోపిక్ త‌లైవికి సంబంధించి కంగ‌న గెట‌ప్ ఇదివ‌ర‌కూ రివీలైన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటే మ‌రో భారీ యాక్ష‌న్ సినిమాని ఈ కొత్త ఏడాది ప్రారంభించ‌నుంది.


Tags:    

Similar News