రచయిత్రి కనికా ధిల్లాన్ పరిచయం అవసరం లేదు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కోడలుగా .. ప్రకాశ్ కోవెలమూడి మాజీ భార్యగా సుపరిచితం. కనికా థిల్లాన్ పలు తెలుగు చిత్రాలకు పని చేసారు. కానీ అవేవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. అయితే కనిక అప్పటికే బాలీవుడ్ లోనూ రచయితగా సుపరిచితం.
స్త్రీ వాద రచనలతో పలు వైవిధ్యమైన సినిమాలకు పని చేసిన కనిక గొప్ప గౌరవాన్ని అందుకున్నారు. స్క్రీన్ రైటర్ కనికా ధిల్లాన్ హిందీ సినిమాల చరిత్రలో చాలా గుర్తుండిపోయే ఎక్కువగా చర్చించుకోదగిన పాత్రలను రాశారు. తాప్సీ పన్ను- అభిషేక్ బచ్చన్- విక్కీ కౌశల్ కాంబినేషన్ మూవీ మన్మర్జియాన్ తో విమర్శకుల ప్రశంసలు పొందిన రచయితగాను సుపరిచితం. అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' కి కనిక రచయిత. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శనతో నిరాపరిచింది. దీనికి కారణాలను తాజాగా కనిక థిల్లాన్ విశ్లేషించారు. అక్షయ్ కుమార్ -భూమి పెడ్నేకర్ రక్షా బంధన్ కథాంశం విభిన్నమైనది. ఇది సంఘంలోని సెక్సిస్ట్ రిగ్రెసివ్ గా పరిగణించాల్సిన కథ. బాక్సాఫీస్ వద్ద ఆదరణ పొందడంలో విఫలమైందని అన్నారు.
తాజా ఇంటర్వ్యూలో కనికా ధిల్లాన్ మాట్లాడుతూ ఈ చిత్రం భారతదేశం లోని 'కౌ బెల్ట్' కోసం రూపొందించినది. పట్టణ భారతదేశం కోసం కాదు. భారతదేశంలో వరకట్న మరణాలపై అధికారిక గణాంకాలకు ఈ చిత్రం ప్రతిబింబం అని కనిక అన్నారు. మేము సినిమా చేసాం. కౌ బెల్ట్ (పల్లెలు) హిందీ బెల్ట్ కోసం సినిమా రాశాం. ఈ హిందీ బెల్ట్ అంటే ఏమిటి? ఇక్కడ చాలా మంది స్త్రీలు వరకట్న మరణాలకు గురవుతున్న చోటు. ఈ గణాంకాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. లాలా కేదార్ నాథ్ (రక్షా బంధన్ లో అక్షయ్ కుమార్ పాత్ర) లాగా ఆలోచించే సమాజం ఉనికిలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. వారు స్త్రీలను పశువుల్లా చూస్తారు. ఆడవారు ఆబ్జెక్ట్ చేయబడతారు. కట్న మార్కెట్ కు సిద్ధమవుతున్నారు. అమ్మాయిలు సన్నగా తీగలా మారాలని కోరతారు. ఎవరైనా ఈలలు వేస్తే... మీరు వారిని పెళ్లి చేసుకోవాలని భావించాలని షరతులు విధిస్తారు. మరి భారతదేశంలో మహిళలు ఎందుకు చనిపోతున్నారు? ఈ మైండ్ సెట్ ఎవరికి ఉంది? మగవారి తిరోగమన ఆలోచనలే దీనికి బాధ్యత వహిస్తాయి... అని అన్నారు.
గ్రామీణ భారతదేశంలోని వాస్తవికతలను చూపించిన ఈ చిత్రం పట్టణ ప్రేక్షకులకు తమకు సంబంధం లేని విధంగా అసౌకర్యానికి గురి చేసిందని ధిల్లాన్ నొక్కి చెప్పారు. నిజానికి మనం గ్రామీణ భారతదేశానికి చాలా దూరంగా ఉన్నాము. కానీ అది ఉనికిలో లేదని దీని అర్థం కాదు. మా కథాంశం డిజైన్ ప్రకారం ఈ సినిమాని కౌ బెల్ట్ కోసం తీయాలనుకున్నాం. కేవలం మా అంచనాల్లో తప్పుడు లెక్కలు మిస్ ఫైర్ ఏమిటంటే.. యువత అలాంటి కథలతో నిమగ్నమవ్వడానికి ఇష్టపడలేదు. పట్టణ ప్రేక్షకులు ఇది కౌ బెల్ట్ సినిమా అని భావించారు. గణాంకాలు పరిశీలిస్తే ఈ చిత్రం ఇంటీరియర్స్ లో చాలా బాగా ఆడింది. అయితే సినిమా థీమ్ దానికి సంబంధించిన ట్రీట్ మెంట్ కారణంగా మేము పట్టణ ప్రేక్షకులను చేరలేకపోయాం. మేము వేరే రకమైన ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకోవడానికి ప్రయత్నించాం. అయితే అది ఒక భిన్నమైన చర్చ. మేము కోరుకున్న ప్రేక్షకులకు చేరాము. అక్కడ ఏమి జరుగుతుందో చూపించాము. వరకట్న బాధితుల కథల్లో మీకు ఏది సరైనదో చూపించే ముందు మీకు ఏది తప్పు అనేది చెప్పాలి.. అని విశ్లేషించారు.
గ్రామీణ భారతదేశంలోని మహిళల గ్రౌండ్ రియాలిటీని చూపించడానికి ఈ చిత్రంలో ఉపయోగించిన సెక్సిస్ట్ ఇతివృత్తాలను సమర్థిస్తూ ధిల్లాన్ ఇలా అన్నారు. ''బాడీ షేమింగ్ .. స్త్రీలను పశువులలాగా చూడడం మ్యారేజీ ఏజెన్సీలు లేదా ఎంపిక లేని స్త్రీలకు.. వివాహం మాత్రమే అంతిమ లక్ష్యం. స్త్రీ జీవితం ఎలా ఉంది? అంటే.. మగవారు స్త్రీలను చంపడం. వారు మంచిగా ఏమీ చూడలేదు. వారు స్వతంత్రంగా ఉండాలని ఆడవారికి చెప్పరు. ఆడవారు.. తండ్రులు కట్నం కోసం కష్టపడుతున్న కుటుంబ సభ్యులను చూశారు. కాబట్టి వారు తమను తాము చంపుకోవడం మంచి నిర్ణయం అని నిర్ణయించుకున్నారు. ఈ దేశ గణాంకాలు చెబుతున్నది ఇదే. దాని నుండి మనం ఎలా మార్చగలం అనేది నా ప్రశ్న. రక్షా బంధన్ తో నేను ఈ ఆలోచనను కలిగి ఉన్న ప్రేక్షకులను చేరుకోవడానికి ప్రయత్నించాను. నిర్దిష్ట ప్రేక్షకులు నాకు పెద్ద బాక్సాఫీస్ నంబర్ లను అందించేంత పెద్దవారు కాదు. కానీ అది అనుకున్న స్థానానికి చేరుకుంది... అని కనిక థిల్లాన్ సమర్థించుకున్నారు.
అయితే రక్షా బంధన్ నుండి నేర్చుకునేది ఏమిటి అంటే? మరింతగా ప్రజలను కలుపుకొని చిత్రాలను రాయడం అని ధిల్లాన్ చెప్పారు. మనం పెద్ద బాక్స్ ఆఫీస్ నంబర్ ను లక్ష్యంగా చేసుకుంటే పట్టణ ప్రేక్షకులను మరింత కలుపుకొని ఉండాలి. నేను ఎక్కువగా అర్బన్ .. యూత్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ల గురించి రాస్తాను. అయితే రక్షాబంధన్ అందుకు పూర్తి భిన్నమైనది అని తెలిపారు.
ధిల్లాన్ రచనలు ఎంచుకున్న ఇతివృత్తాల కారణంగా చాలా చర్చల్లోకొచ్చాయి. ''మీరు నా పనిని పరిశీలిస్తే, ... మన్మర్జియాన్ నుండి జడ్జిమెంటల్ హై క్యా వరకు, ...కేదార్‌నాథ్ నుండి గిల్టీ వరకు ..రష్మీ రాకెట్ నుండి హసీన్ దిల్రూబా 1 వరకు వైవిధ్యమైన కథలను కలిగి ఉన్న విభిన్న రకాలైన స్త్రీల కథలు.. వైవిధ్యమైన పాత్రలు చూపించామనే ఆలోచన ఉంది. చెప్పడానికి అన్వేషించడానికి చాలా ఉంది. నా చివరి పాత్ర ఇలాగే ఉంటుందని.. నా తర్వాతి పాత్ర అలా ఉండాలని నేను కూర్చుని నిర్ణయించుకోను. కానీ ఒక కళాకారిణిగా.. రచయితగా.. నిర్మాతగా నేను విభిన్న కోణాలను ప్రయత్నించాలనుకుంటున్నాను... అని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.