సింగర్ కనికా కపూర్ కరోనా వైరస్ చాప్టర్ ని తన లైఫ్ నుండి ఇప్పుడప్పుడే వదిలించుకునేలా లేదు. ఈ బేబీ డాల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. చాలా రోజులుగా ఐసోలేషన్ లో గడిపిన కనికా కొన్ని రోజుల క్రితం మూడు సార్లు కోవిడ్ - 19 టెస్టులో నెగటివ్ రావడంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమెను మరో పద్నాలుగు రోజులు ఇంట్లో నుండి బయటకి రావద్దని వైద్యులు ఆదేశించారట. మార్చి 9న లండన్ నుంచి వచ్చిన కనికా కపూర్ ఉత్తర ప్రదేశ్‌లోని ఒక హోటల్‌లో బస చేసింది. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు కరోనా సోకినట్లు తేలడంతో సంచలనం రేగింది.. దాంతో పాటు ఆమెను కలిసిన వాళ్లను కూడా సెల్ఫ్ క్వారంటైన్ లోకి పంపించారు. మరోవైపు విదేశాల నుండి వచ్చిన వారు తప్పనిసరిగా 14 రోజులు నిర్బంధంలో ఉండాలని కరోనాపై ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు పాటించకుండా.. కరోనా వచ్చిన తర్వాత కూడా పార్టీకి వచ్చినందుకు కనికాపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆమెను ఉత్తరప్రదేశ్ లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స అందించారు. వరసగా ఐదు సార్లు కరోనా పాజిటివ్ వచ్చినా.. ఆరోసారి ఆమెకు నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు కుటుంబ సభ్యులు.
అయితే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన కనికా కపూర్ పై బాధ్యతారాహిత్యంపై పోలీసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీని గురించి ఆమెను కలవడానికి వెళ్లిన లా ఆఫీసర్స్ షాక్ అయ్యారట. కారణం కనికా కపూర్ ఇంట్లో లేకపోవడమే. మరో పద్నాలుగు రోజులు ఇంట్లో నుండి బయటకి రావద్దని డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో కనికా ఇంట్లో ఉంటుందని భావించిన అధికారులకి కనికా షాక్ ఇచ్చింది. అసలు విషయం తెలుసుకుంటే ఆమె హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయిందట. దీంతో కనికా విషయంలో మళ్ళీ అందరూ కంగారు పడుతున్నారు. ఇప్పుడు లక్నో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి. ప్రస్తుతం కనికా ఎక్కడ ఉందో కనుక్కొని ఆమెని తిరిగి లక్నోకి తీసుకొస్తారేమో చూడాలి. ఏదేమైనా కనికా కపూర్ ని కరోనా వదిలినా.. ఇప్పుడు కనికా మాత్రం కరోనాని వదలడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు.