కన్నడ స్టార్ హీరో అర్జున్ పై శృతి హరిహరన్ లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. దాంతో తన పరువు తీసింది అంటూ అర్జున్ పరువు నష్టం కేసు వేయడం జరిగింది. దాంతో పాటు పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చాడు. అర్జున్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు శృతిపై ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు. తనపై నమోదు అయిన ఎఫ్ ఐ ఆర్ ను రద్దు చేయాలంటూ శృతి హరిహరన్ కోర్టును ఆశ్రయించింది. ఎఫ్ ఐ ఆర్ రద్దు విషయమై వాదనలు విన్న కోర్టు తాజాగా ఆమె వాదనలతో ఏకీభవించి ఎఫ్ ఐ ఆర్ రద్దుకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
శృతి హరిహరన్ లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన కారణంగానే ప్రతీకార చర్యగా అర్జున్ ఫిర్యాదు చేయడం జరిగిందని, అందుకే ఆమెపై నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ ను రద్దు చేయాలని కోర్టు ఆదేశించింది. మరో వైపు లైంగిక వేదింపుల విషయంలో అర్జున్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యింది. శృతి హరిహరన్ ఫిర్యాదు మేరకు పోలీసులు అర్జున్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం జరిగింది.
సౌత్ సినిమా పరిశ్రమలో పెను సంచలనంగా మారిన వీరిద్దరి వ్యవహారం గత నెల రోజులుగా సాగుతూనే ఉంది. వీరిద్దరి మద్య రాజీకి ప్రయత్నించినా కూడా ఇద్దరు పట్టుదలతో ఉన్న కారణంగా రాజీ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. దాంతో రాజీ ప్రయత్నాలను అంబరీస్ మానేశాడు. ఒక వైపు అర్జున్ పై ఆరోపణలు చేస్తున్న శృతి హరిహరన్ న్యాయ పరమైన చిక్కులను కూడా దాటుకుంటూ వెళ్తోంది. మొత్తానికి అర్జున్ ను ఆమె చాలా కఠినంగా ఎదుర్కొంటోంది.