కన్నడ బ్యూటీ సంజన ఇటీవల ఊహించ ని రాంగ్ రీజన్స్ తో వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. బెంగళూరు లోని ఓ హోటల్లో జరిగిన గొడవ లో కన్నడ నిర్మాత వందనా జైన్ పైకి సంజన బీర్ బాటిల్ విసిరిందని ఈ గొడవ లో బోలెడంత రాద్ధాంతం చేసిందని ప్రచారమైంది. ఆ సమయం లో సంజన ఫుల్ గా తాగి ఉండడం వల్ల అదుపు తప్పి ప్రవర్తించిందని ప్రత్యర్థి వందనా జైన్ ఆరోపించారు.
అయితే ఈ గొడవ లో తన పై జరిగిన దుష్ప్రచారాన్ని సంజన ఖండించింది. అదంతా ఫేక్ ప్రచారం. వాస్తవం కానేకాదు. అయినా అదే రోజు ఆ గొడవలో రాజీ బేరం కుదిరింది. అందుకు పోలీసుల సాయం తీసుకున్నాం అని సంజన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇక తాను తప్ప తాగి రచ్చ చేశానన్న వార్తలోనూ నిజం లేదని తెలిపింది. అదంతా ప్రత్యర్థి దుష్ప్రచారం అని వెల్లడించింది.
24 సాయంత్రం బెంగళూరు లోని ఓ స్టార్ హోటల్లో గొడవ జరిగింది. ఆ గొడవలోనే సదరు నిర్మాతకు 200 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటూ సంజన ఫైరైంది. ఇక సంజన ఆరోపణలకు కౌంటర్ గా వందనా జైన్ అంతే ధీటుగా స్పందించారు. తాము నోరు విప్పితే సంజన భండారం మొత్తం బయట పడుతుంది! అంటూ వందనా జైన్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి నాటి గొడవ వైరల్ గా యువతరంలో చర్చకు వచ్చింది.