ప్రభాస్ మూవీ బుజ్జిగాడులో హీరోయిన్ త్రిష చెల్లెలుగా ఆకట్టుకున్న సంజన.. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ లో విలన్ భార్యగా కూడా మెప్పించింది. అడపాదడపా అవకాశాలు వస్తే తెలుగు సినిమాలు చేస్తున్న సంజనా గల్రానీ.. ఎక్కువగా శాండల్ వుడ్ సినిమాలనే చేస్తోంది.
రీసెంట్ గా కన్నడలో ప్రసారమమవుతున్న బిగ్ బాస్ టీవీ షో కోసం ఓ వీడియో బైట్ ఇచ్చింది ఈ భామ. కేఎఫ్సీసీ సభ్యులు.. బిగ్ బాస్ షోని వ్యతిరేకిచడంపై కామెంట్ చేయాలంటూ ఆమెపై ఒత్తిడి చేయగా.. మాటల్లో భాగంగా. కన్నడ సినిమాలను డబ్బా మూవీస్ అంటూ నోరు జారింది ఈ బ్యూటీ. ఇది అక్కడి నిర్మాతలను బాగానే మండించేసింది. దీంతో కన్నడ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు కంప్లెయింట్ చేయడం.. హాజరు కావాలంటూ ఆమెకు సమన్ జారీ చేయడం కూడా జరిగిపోయింది.
పరిస్థితి చేజారుతోందని గ్రహించిన సంజన.. తాను కన్నడ ఇండస్ట్రీని అవమానించలేదని.. ఆ ఛానల్ వాళ్లు సెన్సేషనలిజం కోసం తన బైట్ ను ముక్కలు ముక్కలుగా కట్ చేసి.. తన ఉద్దేశాన్ని నాశనం చేశారని క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు.. తను ఎవరినై బాధ పెట్టి ఉంటే.. వాళ్లందరికీ ఓ సారీ కూడా చెప్పేయడంతో.. ఈ వివాదం సద్దుమణిగిందనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/