కన్నడ సినిమా పరిశ్రమలో మీటూ మూమెంట్ పతాక స్థాయికి చేరుకుంది. హీరోయిన్స్ హీరోలు మరియు దర్శకులపై లైంగిక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కన్నడ సినిమా పరిశ్రమ రెండుగా చీలిపోయినంత పనైంది. మీటూకు మద్దతుగా ఒక వర్గం వారు - లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా మరి కొందరు నిలుస్తున్నారు. ఈ సమయంలోనే హీరోయిన్ సంజన దర్శకుడు రవి శ్రీవత్సపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. దర్శకుడు తనను లైంగికంగా వేదించాడంటూ సంచలన ఆరోపణలు చేసిన సంజన కన్నడ సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించింది.
‘గండ హెండతి’ చిత్రం కోసం నన్ను సంప్రదించిన సమయంలో ఒక్క ముద్దు మాత్రమే అంటూ దర్శకుడు శ్రీవత్స చెప్పారు. కాని షూటింగ్ సమయంలో ముద్దులు పెట్టాల్సిందే అంటూ 30 ముద్దులు పెట్టించారు. హీరోతో మాత్రమే కాకుండా, ఆయన కూడా ముద్దులు పెట్టేందుకు ప్రయత్నించాడు అంటూ సంచలన ఆరోపణలు చేసిన సంజనపై దర్శకుడు శ్రీవత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తాను ముద్దులు పెట్టేందుకు సినిమా తీయలేదని పేర్కొన్నాడు.
తాను చేస్తున్న సినిమా ‘మర్డర్’ చిత్రానికి రీమేక్ అని, ఆ చిత్రంకు సంబంధించిన సీడీ ఆమెకు ఇచ్చి ఒకటికి రెండు సార్లు చూడమని చెప్పాను. ఆ చిత్రంలో హీరోయిన్ తరహాలోనే నువ్వు నటించాల్సి ఉంటుందని చెప్పాను. అంతే తప్ప ఒకే ముద్దు ఉంటుందని నేను చెప్పలేదు అన్నాడు. పబ్లిసిటీ కోసం నాపై ఆరోపణలు చేసిన సంజన రేపటి వరకు క్షమాపణ చెప్పక పోతే తాను తీసుకోబోయే లీగల్ చర్యలకు సిద్దంగా ఉండాలని హెచ్చరించాడు. శ్రీవత్స తనకు సంజన క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు పరువు నష్టం దావాలు వేశారు, అదే జాబితాలో రవి శ్రీవత్స కూడా చేరబోతున్నాడు.