కన్నడ సినిమాల కాసుల వర్షం.. @టాలీవుడ్!

Update: 2022-10-27 02:37 GMT
తెలుగు సినిమా ప్రేక్షకుల గొప్పతనం ఏమిటి అంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను భాషా భేదం లేకుండా ఆదరిస్తూ ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. కంటెంట్ బాగుంటే బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా మంచి సినిమాలకు ఎప్పుడు కూడా ఒక మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక ఇటీవల కన్నడ సినిమాలకు కూడా తెలుగులో భారీ స్థాయిలో స్పందన లభిస్తూ ఉండడం విశేషం.

ముఖ్యంగా కేజిఎఫ్ సినిమా నుంచి అయితే కన్నడ తలరాతను ఒక్కసారిగా మార్చేసింది అని చెప్పాలి. కాస్త హై బడ్జెట్తో తెరపైకి వస్తున్న సినిమాలలో అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలవుతున్నాయి.

కంటెంట్ బాగుంటే మాత్రం ఆడియన్స్ కన్నడ సినిమాలను బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఇక మొదట పెద్దగా అంచనాలు లేకుండా నెగిటివ్ రివ్యూలతోనే తెలుగు థియేటర్లలోకి వచ్చిన కేజిఎఫ్ సినిమా పెట్టిన పెట్టుబడికి అయితే అప్పట్లో మంచి లాభాలను అందించింది.

కేజిఎఫ్ చాప్టర్ వన్ తెలుగులో 13 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకుంది. ఇక తర్వాత కేజిఎఫ్ సెకండ్ చాప్టర్ అయితే ఊహించిన విధంగా 84 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకుని అందరికీ మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటివరకు తెలుగులో ఏ డబ్బింగ్ సినిమా కూడా ఆ స్థాయిలో కలెక్షన్స్ అయితే అందుకోలేదు. ఇక అదే విధంగా రీసెంట్ గా వచ్చిన కాంతార సినిమా కూడా ఊహించని విధంగా కలెక్షన్స్ అందుకుంది.

గీత ఆర్ట్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక పెట్టిన పెట్టుబడికి కాంతర సినిమా భారీ స్థాయిలో ప్రాఫిట్ అందించింది. మొత్తంగా ఇప్పటివరకు అయితే 15.13 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకుంది. ఈ సినిమా ఈజీగా 18 కోట్ల వరకు దాటవచ్చు అని కుదిరితే 20 కోట్లు మార్క్ ను కూడా టచ్ చేసే అవకాశం ఉంది.

ఈ సినిమాలతో పాటు మరికొన్ని కన్నడ సినిమాలు కూడా తెలుగులో మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. అందులో కిచ్చ సుదీప్ నటించిన విక్రాంత్ రోనా కూడా ఉంది. ఈ సినిమా 4.7 కోట్ల షేర్ కలెక్షన్స్ తో పెట్టిన పెట్టుబడికి అయితే మంచి లాభాలు అందించింది. గతంలో వచ్చిన కురుక్షేత్రం సినిమాతో పాటు శ్రీమన్నారాయణ వంటి మరికొన్ని కన్నడ సినిమాలు కూడా తెలుగులో చేసిన బిజినెస్ కు తగ్గట్టుగా బయ్యర్లకు ప్రాఫిట్స్ అయితే అందించాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News