కరోనా తరువాత ప్రేక్షకులు థియేటర్లలకు రావడం తగ్గించేశారు. థియేటర్లకు మించి ఓటీటీలకు ఎడిక్ట్ అయిపోయారు. దీంతో ఓటీటీలకు ఆదరణ పెరగడం మొదలైంది. ప్రతీవారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కంటే పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లపై ఓటీటీ ప్రియులు, సినీ లవర్స్ అమితాసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతాయా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ చెప్పేసింది.
డిజిటల్ వరల్డ్ లో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ దే పైచేయిగా కనిపిస్తూ వస్తోవంది. ఇటీవల `RRR`తో మరింత క్రేజ్ ని సొంతం చేసుకుని టాప్ లో నిలిచింది. అయితే ఆ ఆధిపత్యాన్ని అధిగమించడానికి అమెజాన్ ప్రైమ్ గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన బ్లాక్ బస్టర్ అమెజాన్ కు దక్కడం లేదు. తాజాగా అలాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాల స్ట్రీమింగ్ హక్కుల్ని తాజాగా అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
ఇటీవల భారీ స్థాయిలో విడుదలై పాన్ ఇండియా సినిమాలుగా సంచలనం సృష్టించిన `పొన్నియిన్ సెల్వన్ 1`, కన్నడ సెన్సేషన్ `కాంతార` చిత్రాల స్ట్రీమింగ్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఈ రెండు సినిమాలు నవంబర్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా `పొన్నియిన్ సెల్వన్ 1`ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో విక్రమ్, కార్తి, ఐశ్వర్యా రాయ్, త్రిష, జయం రవి కీలక పాత్రల్లో నటించారు.
బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ మూవీని తెలుగుతో పాటు ఇతర భాషల్లో చూడని వారు చాలా మందే వున్నారు. వారికి నవంబర్ నెల బ్లాక్ బస్టర్ మంత్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇదే నెలలో రిషబ్ శెట్టి సెన్సేషనల్ మూవీ `కాంతార` కూడా స్ట్రీమింగ్ కాబోతోంది. నవంబర్ 4న ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే రూ. 200 కోట్ల మేర వసూళ్లని రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ రెండు సినిమాలు ఓకే సారి నవంబర్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుండటంతో ఓటీటీ ప్రేక్షకులు నవంబర్ నెలని బ్లాక్ బస్టర్ మంత్ గా భావిస్తున్నారట. థియేటర్లలో ఈ రెండు సినిమాలని చూడని
వారంతా అమెజాన్ ప్రైమ్ లో వీటి కోసం భారీ స్థాయిలో ఎగబడటం ఖాయం అని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్ డేట్ లని అమెజాన్ ప్రైమ్ వర్గాలు త్వరలోనే వెల్లడించనున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.