సినిమాలో విషయం ఉంటే ఆ సినిమా ఏ భాషలో తెరకెక్కినా సరే హిట్ చేస్తారు తెలుగు ఆడియన్స్. ఇది దశాబ్ధాలుగా ప్రూవ్ అవుతూనే ఉంది. తెలుగు ప్రేక్షకులకు సినిమాని అంతగా కనెక్ట్ చేసుకున్నారు. సరైన కంటెంట్ తో సినిమా తీస్తే ఎక్కడ ఆడినా ఆడకపోయినా తెలుగులో ఖచ్చితంగా హిట్ అవుతుంది.
ఈ విషయంలో తెలుగు ఆడియన్స్ గొప్పదనం గురినిచి ఇతర భాషా నటీనటులు కూడా సందర్భానుసారంగా చెబుతూ వస్తున్నారు. అయితే ఒక్కోసారి డబ్బింగ్ సినిమాలు భారీ అంచనాలతో వచ్చి బొక్కబోర్లా పడ్డ సందర్భాలు ఉన్నాయి.
డబ్బింగ్ సినిమాల మీద దాదాపు ఆశలు వదులుకున్న టైం లో కన్నడ బ్లాక్ బస్టర్ కె.జి.ఎఫ్ అంచనాలను మించి వసూళ్లను రాబట్టింది. ఆ సినిమా తర్వాత కన్నడ నుంచి వస్తున్న ప్రతి సినిమా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. లేటెస్ట్ గా రిషబ్ శెట్టి కాంతార మూవీ కూడా ఆ లిస్ట్ లో చేరింది.
అసలేమాత్రం అంచనాలు లేకుండా రిలీజైన కన్నడ సినిమా కాంతార తెలుగులో రికార్డులను సృష్టిస్తుంది. స్టార్ సినిమా రేంజ్ వసూళ్లని చూసి ఆ సినిమా హీరో షాక్ అవుతున్నారు. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో డబ్బింగ్ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన లిస్ట్ లో కె.జి.ఎఫ్ 2 ముందు ఉంది. ఆ తర్వాత కమల్ హాసన్ విక్రం సినిమా సెకండ్ ప్లేస్ ఉండగా కాంతార వచ్చి కమల్ విక్రం ని వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లో నిలిచింది.
కాంతార తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 19 కోట్ల పైన షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది. ఈ వీకెండ్ సినిమాలు ఉన్నా సరే అవేవి పెద్దగా ఆడియన్స్ లో ఆసక్తి కలిగించడం లేదు. అందుకే ఈ వీకెండ్ కూడా తెలుగు ఆడియన్స్ కాంతారకే ఓటు వేసేలా ఉన్నారు. కాంతార కి తెలుగులో వచ్చిన ఈ యునానిమస్ రెస్పాన్స్ చూసే చిత్రయూనిట్ ప్రేక్షకులను కలిసి డైరెక్ట్ గా థ్యాంక్స్ చెప్పేందుకు తెలుగు రాష్ట్రాల టూర్ ఏర్పాటు చేసుకున్నారు.
సో ఈ ఇయర్ డబ్బింగ్ సినిమాల సూపర్ హిట్ లిస్ట్ లో తెలుగులో కె.జి.ఎఫ్ 2 ఫస్ట్ ప్లేస్ లో ఉండగా కాంతార సెకండ్ ప్లేస్ లో నిలిచింది. కమల్ విక్రం థర్డ్ ప్లేస్ లో ఉంది. తెలుగు బాక్సాఫీస్ పై డబ్బింగ్ సినిమాల దూకుడు మళ్లీ ఎక్కువైందని చెప్పొచ్చు. ఒకప్పుడు తమిళ సినిమాల ప్రభావం టాలీవుడ్ బాక్సాఫీస్ పై ఉండేది ఇప్పుడు ఆ ఛాన్స్ కన్నడ పరిశ్రమ తీసుకుంటుంది. రానున్న సినిమాలు కూడా శాండల్ వుడ్ సత్తాని చాటేలా ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.