థియేటర్లలోనే చూసి ఆస్వాదించాల్సిన పెద్ద స్థాయి సినిమాలు వస్తే వాటి పట్ల తెలుగు ప్రేక్షకుల ఆసక్తే వేరుగా ఉంటుంది. అది వేరే భాషా చిత్రమైనా, డబ్బింగ్ సినిమా అయినా పెద్దగా పట్టింపు ఉండదు. సినిమా సూపర్, విజువల్స్ అదరహో, క్లైమాక్స్ కేక లాంటి రివ్యూస్ ఆన్ లైన్లో చూశారంటే ఎగబడిపోతారు.
తాజాగా కన్నడ చిత్రం కాంతార మన ప్రేక్షకుల దృష్టిని అలాగే ఆకర్షించింది. కన్నడ వెర్షన్ కోసమే హైదరాబాద్ లాంటి సిటీస్‌లో మన ప్రేక్షకులు ఎగబడ్డారు. అది చూసి ఈ చిత్రాన్ని చకచకా తెలుగులోకి అనువదించి శనివారమే రిలీజ్ చేశారు. ఈ వారం బోలెడన్ని తెలుగు సినిమాలు రిలీజైనా, గతవారం రిలీజైన గాడ్‌ఫాదర్ కూడా మేజర్ థియేటర్లలో ఆడుతుండగా.. కాంతార తెలుగు ప్రేక్షకులను పూర్తిగా తన వైపు తిప్పుకుంటున్న తీరు చూసి మన ట్రేడ్ పండిట్లు షాకైపోతున్నారు.
అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే జోరు చూపించిన కాంతార.. పాజిటివ్ రివ్యూలను పూర్తిగా ఉపయోగిచుంకుంది. మ్యాట్నీల నుంచి ఈ సినిమాకు బుకింగ్స్ బాగా పుంజుకుని శనివారం సాయంత్రానికి సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సులు అని తేడా లేకుండా హౌస్ ఫుల్స్‌తో రన్ అయ్యే పరిస్థితి వచ్చింది. రిషబ్ శెట్టి అనే మనకు పరిచయం లేని హీరో సినిమాకు తొలి రోజు సింగిల్ స్క్రీన్లు ఫుల్ కావడం మామూలు విషయం కాదు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని మెయిన్ థియేటర్ సంధ్యలో ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఫుల్స్ పడిపోయాయి. మల్టీప్లెక్సులు, డబుల్ థియేటర్లు సాయంత్రం ఈ సినిమా ఊపు చూసి స్క్రీన్లు, షోలు పెంచేశారు. డిమాండ్, క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతుండడంతో ఆదివారం నుంచి స్క్రీన్లు, షోలు మరింత పెరగబోతున్నాయి. ఆదివారం ఈ సినిమా షేర్ ఊహించని రేంజిలో ఉండేలా కనిపిస్తోంది.