తెలుగు ప్రేక్షకులకు ఒక సినిమా నచ్చితే భాషా భేదం లేకుండా ఏ స్థాయిలో ఆదరిస్తారు అనడానికి 'కాంతార' సినిమా కొత్త రుజువుగా నిలుస్తోంది. ఈ కన్నడ డబ్బింగ్ సినిమాకు తెలుగులో వస్తున్న స్పందన చూసి కన్నడిగులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తోంది.
గత నెల 30 కర్ణాటకలో విడుదలై అక్కడ అద్భుత స్పందన తెచ్చుకున్న ఈ చిత్రాన్ని కన్నడలో చూసేందుకు హైదరాబాద్ లాంటి సిటీల్లో జనం ఎగబడ్డారు. అది చూసి ఆలస్యం చేయకుండా చకచకా డబ్బింగ్ చేసి గత శనివారం తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు.
కన్నడలో తొలి రెండు రోజుల్లో వచ్చిన వసూళ్ల కంటే తెలుగులో ఈ చిత్రానికి శని, ఆదివారాల్లో వచ్చిన కలెక్షన్లు ఎక్కువ కావడం విశేషం. 'కేజీఎఫ్' లాంటి ఎలివేషన్లు, మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న సినిమాను ఆదరించడం ఓకే కానీ... ఇలా తమ ప్రాంత ఆచారాల చుట్టూ తిరిగే ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఈ స్థాయిలో నెత్తిన పెట్టుకోవడం కన్నడిగులకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
ఎలాంటి సినిమా అయినా.. ఆదివారం దాటాక వీక్ అవుతుంటుంది. సోమవారం నుంచి వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అవుతాయి. దసరా సినిమా 'గాడ్ ఫాదర్'కు కూడా ఈ డ్రాప్ తప్పలేదు. కానీ 'కాంతార' వసూళ్లు మాత్రం సోమవారం కూడా నిలకడగానే ఉన్నాయి.
వీకెండ్ అయిపోయింది కాబట్టి కలెక్షన్లు కొంతమేర తగ్గాయి కానీ.. అది పెద్ద డ్రాప్ అయితే కాదు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తొలి రోజు ఒక్క థియేటర్‌తో మొదలై రెండో రోజుకు రెండు థియేటర్లకు పెరిగిన ఈ సినిమా సోమవారం రెండు చోట్లా ఫస్ట్, సెకండ్ షోలకు దాదాపుగా హౌస్ ఫుల్స్‌తో నడిచింది.
మల్టీప్లెక్సుల్లోనూ ప్యాక్డ్ హౌసెస్‌తో రన్ అవుతోందీ చిత్రం. డిమాండ్ చూసి స్క్రీన్లు, షోలు పెంచుతూనే ఉన్నారు. ఈ వారం నాలుగు కొత్త సినిమాలు రిలీజవుతున్నప్పటికీ.. 'కాంతార'కు క్రేజ్ తగ్గేలా కనిపించడం లేదు. కొత్త సినిమాలు దీన్ని చూసి భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఫుల్ రన్లో ఈ సినిమాకు పాతిక కోట్లకు తక్కువ గ్రాస్ వచ్చేలా కనిపించడం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.