తెలుగులో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తరువాత వినిపించే పేరు కాంతారావు. ఒక వైపున పౌరాణికాలలో ఎన్టీఆర్ .. మరో వైపున సాంఘికాలలో ఏఎన్నార్ తిరుగులేని చక్రవర్తులుగా ఏలుతున్న రోజుల్లో, జానపదాలను ఎంచుకుని వాటిలో రాణించిన కథానాయకుడు కాంతారావు. అప్పట్లోనే పెద్ద బడ్జెట్లో ఎన్టీఆర్ .. ఎన్నార్ సినిమాలు నిర్మితమయ్యేవి. అయితే ఓ మాదిరి బడ్జెట్ తో నిర్మితమైన కాంతారావు సినిమాలు వాటికి పోటీగా నిలిచేవి. అంతగా ఆయన జానపదాలకు క్రేజ్ ఉండేది.
కండలు తిరిగిన దేహం .. కత్తి తిప్పడంలో నైపుణ్యం కాంతారావును జానపద కథానాయకుడిగా నిలబెట్టాయి. అందువల్లనే ఆయనను కండల కాంతారావు ... కత్తి కాంతారావు అని అభిమానులు పిలుచుకునేవారు. జానపదాల్లో ఆయన రూపం ఎంతో అందంగా .. ఆకర్షణీయంగా ఉండేది. ఇక సాంఘికాల్లో సోలో హీరోగానే కాకుండా మల్టీస్టారర్లలోను మెప్పించారు. పౌరాణిక చిత్రాల్లో లక్ష్మణుడుగా .. కృషుడిగా .. నారదుడిగాను కనిపించారు. ఇలా నటుడిగా కొన్ని దశాబ్దాల పాటు ఆయన ప్రయాణం కొనసాగింది.
అయితే దురదృష్టం కొద్దీ ఆయన దృష్టి సినిమాల నిర్మాణంపై పడింది. దాంతో ఆయన ఒక వైపున నటిస్తూనే .. మరో వైపున నిర్మాణ రంగంలోకి దిగారు. అలా ఆయన సప్తస్వరాలు .. గండర గండడు .. ప్రేమజీవులు .. గుండెలు తీసిన మొనగాడు .. స్వాతి చినుకులు వంటి సినిమాలు నిర్మించారు. మొదటి సినిమా మినహా మిగతా సినిమాలన్నీ కూడా ఆయనకి నష్టాలనే తీసుకొచ్చాయి. దాంతో ఆయన తన కార్లను .. బంగ్లాలను అమ్ముకోవలసి వచ్చిది. చివరి రోజుల్లో ఆర్ధికపరమైన ఇబ్బందులను అనుభవించవలసి వచ్చింది.
కాంతారావు స్వభావం చాలా సున్నితమైనది .. ఆయన దానధర్మాలు ఎక్కువగా చేసేవారు. తన సినిమాల నిర్మాతలను పారితోషికం విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవారుకాదు. మొహమాటం కారణంగా వాళ్లు ఎంత ఇస్తే అంత తీసుకునేవారు. ఇక తనకి రావలసిన డబ్బులను కఠినంగా అడిగే అలవాటు ఆయనకి అసలు లేదు. ఆయన మాటకారి కాదు ... లౌక్యం తెలిసేది కాదు. సినిమాల నిర్మాణం వలన కంటే కూడా, మంచితనం .. మొహమాటమే ఆయన కష్టాలకు ఎక్కువ కారణమయ్యాయని సన్నిహితులు చెబుతుంటారు.