కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడటం ఆలస్యం.. బాలీవుడ్ జనాలు రెచ్చిపోతున్నారు. సల్మాన్ మీద అభిమానాన్ని చాటుకునే క్రమంలో న్యాయ వ్యవస్థను.. చట్టాల్ని కూడా తప్పుబట్టేస్తున్నారు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ కు శిక్ష పడ్డప్పుడు ఎలా రెచ్చిపోయి మాట్లాడారో.. ఇప్పుడూ అలాగే స్పందిస్తున్నారు. సల్మాన్ మంచోడని కితాబులిస్తూ వ్యవస్థ మీద విరుచుకుపడుతున్నారు. కమెడియన్ కపిల్ శర్మ.. ఏకంగా మన వ్యవస్థే చెత్త అని వ్యాఖ్యానించేశాడు.
‘‘నేను ఎంతోమంది బడా బాబులను చూశాను. తాము సింహాలను వేటాడేవాళ్లమని వాళ్లు గర్వంగా చెప్పుకొనే వాళ్లను నేను కలిశాను. కానీ సల్మాన్ అలాంటి వాడు కాదు. చాలా మంచి వ్యక్తి. ఆయన ఆ తప్పు చేశారో లేదో తెలియదు. కానీ ఆయనలోని మంచి కోణాన్ని చూడండి. ఇది చెత్త వ్యవస్థ. మంచి పనిచేయనివ్వదు’’ అని ట్వీట్ చేశాడు కపిల్ శర్మ.
ఈ క్రమంలోనే మీడియా మీద కూడా కపిల్ విరుచుకుపడ్డాడు. పేపర్లు అమ్ముకునేందుకు నెగిటివ్ కథనాలు రాస్తారని.. పెద్ద పెద్ద ఘోరాలు జరిగినా పట్టించుకోని మీడియా వాళ్లు నెగిటివ్ వార్తలు ప్రచారం చేసేందుకు డబ్బులు తీసుకుంటారని అతను ఆరోపించాడు. ‘‘చెత్త వ్యవస్థ - చెత్త మనుషులు. నేనే ప్రధానమంత్రిని అయి ఉంటే.. ఫేక్ న్యూస్ సృష్టించేవారిని ఉరితీసి ఉండేవాడిని’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడతను. సల్మాన్ మంచి వ్యక్తి అని మరోసారి నొక్కి వక్కాణించిన కపిల్.. త్వరలోనే అతను జైలు నుంచి బయటకు వస్తాడని అన్నాడు. ఐతే తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో కాసేపటికే ఈ ట్వీట్లను తొలగించిన కపిల్ శర్మ... తన అకౌంట్ హ్యాక్ అయిందని, తన ట్వీట్లనుపట్టించుకోవద్దని చెప్పడం గమనార్హం.