బాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్.. యాక్టర్ అయిన రాజ్ కుమార్ పూర్వీకుల స్వస్థలం పాకిస్తాన్ లోని పెషావర్. అక్కడ రాజ్ కుమార్ తండ్రి పృథ్వీరాజ్ కపూర్ కు ఒక భారీ బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో 50 గదులతో పాటు సువిశాలమైన ప్రాంగణం ఉండేది. రాజ్ కుమార్ స్వాతంత్య్రం అనంతరం ముంబయి వచ్చి సెటిల్ అయ్యాడు. దేశ విభజన తర్వాత పెషావర్ లో ఉన్న ఆస్తుల గురించి కపూర్ ఫ్యామిలీ పట్టించుకోలేదు. రాజ్ కుమార్ తనయుడు రిషి కపూర్ కొన్నాళ్ల క్రితం ఆ బంగ్లాను పాకిస్తాన్ ప్రభుత్వంకు అప్పగిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకుని దాన్ని మ్యూజియంగా మార్చమంటూ ప్రభుత్వంకు విజ్ఞప్తి చేయడం జరిగింది.
జనావాసాలకు ఆ బంగ్లా దూరంగా ఉండటంతో పాటు చాలా ఏళ్లుగా ఎవరు కూడా అందులో ఉండక పోవడం వల్ల భూతాలు ఆ ఇంట్లో సంచరిస్తున్నట్లుగా స్థానికులు పుకార్లు సృష్టిస్తున్నారు. దాంతో ప్రభుత్వం దాన్ని మ్యూజియంగా మార్చే నిర్ణయాన్ని మార్చుకున్నారట. ఇదే సమయంలో ఒక జ్యువెలరీ వ్యాపారి ఆ బంగ్లాను స్వాదీనం చేసుకునేందుకు సిద్దం అయ్యాడట. దాన్ని కూల్చివేసి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ను నిర్మించేందుకు ప్రభుత్వం వద్ద అనుమతులు కూడా తీసుకున్నాడట.
మ్యూజియంకు పాకిస్తాన్ ప్రభుత్వం ఆసక్తి చూపించని కారణంగా వ్యాపారి కమర్షియల్ కాంప్లెక్స్ ను నిర్మించేందుకు సిద్దం అయ్యాడట. మరి పాక్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈతరం కపూర్ ఫ్యామిలీ తప్పుపట్టనుందా లేదంటే వదిలేశాం అంటూ చేతులు దులుపుకుంటుందా అనేది చూడాలి. మొత్తానికి కపూర్ ఫ్యామిలీకి పాకిస్తాన్ లో ఉన్న ఏకైక గుర్తింపు చెరిగి పోనుంది.