హీరోయిన్‌ కు కౌంటర్‌ ఇస్తున్న నిర్మాత టీమ్‌

Update: 2020-07-21 14:00 GMT
సుశాంత్‌ ఆత్మహత్య తర్వాత కంగనా చేస్తున్న ఆరోపణలతో బాలీవుడ్‌ లో కొందరు తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతున్నారు. బాలీవుడ్‌ మాఫియా అంటూ కరణ్‌ జోహార్‌ ను మరికొందరిని కంగనా తాజాగా రిపబ్లిక్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్రంగా విమర్శించింది. నెపొటిజంకు వారు బ్రాండ్‌ అంబాసిడర్స్‌ మాదిరిగా మారిపోయారంటూ విమర్శలు గుప్పించింది. ఆమె చేసిన విమర్శలు ప్రస్తుతం బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

కంగనా వ్యాఖ్యలు రోజు రోజుకు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో కరణ్‌ జోహార్‌ టీం ప్రస్తుతం కౌంటర్‌ కు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వీడియోను ఇప్పుడు వెలుగులోకి తీసుకు వచ్చారు. కరణ్‌ జోహార్‌ ఆ వీడియోలో కంగనా నాపై మహిళ కార్డ్‌ ను ప్రయోగిస్తుంది. ఆమె ఒక బాధితురాలిని అంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తుండటంతో నేను ఆమెకు బలి అయ్యాను. ఆమె నన్ను టార్గెట్‌ చేసి మహిళ కార్డును ఉపయోగిస్తుంది అంటూ కరణ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

మరో వీడియోలో ఇండస్ట్రీలో మీకు ఎవరి వల్ల ఇబ్బందిగా ఉంది అంటూ ప్రశ్నించగా మీ వల్లే అంటూ కరణ్‌ ముందే కంగనా వ్యాఖ్యలు చేసిన వీడియో కూడా ట్రెండ్‌ అవుతోంది. ఆ వీడియోలో కంగనా అలా అన్న వెంటనే కరణ్‌ సారీ చెప్పడం జరిగింది. అయినా కూడా బాలీవుడ్‌ మాఫియా అంటూ కరణ్‌ ను ఎదురుగా ఉండే ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడినది. ఒక మహిళ అవ్వడం వల్లే ఆమె ఇలా మాట్లాడుతుంది. మహిళ కార్డును ఉపయోగించుకుని ఆమె కరణ్‌ వంటి పెద్ద వారిపై ట్రోల్స్‌ చేస్తుందని కరణ్‌ సన్నిహితులు సోషల్‌ మీడియాలో ఆరోపిస్తున్నారు.
Full View
Tags:    

Similar News