09-09-2022 .. బాలీవుడ్ కి బిగ్ టెన్షన్ డే కాబోతోందా? లేక ఉఫ్! అంటూ రిలీఫ్ ఫీలయ్యే రోజు అవుతుందా? ఇంతకీ ఏం జరగబోతోంది? వరుస భారీ డిజాస్టర్లతో బెంబేలెత్తిన బాలీవుడ్ కి ఇప్పుడు ఘనమైన విజయం అవసరం. కానీ అది రణబీర్ 'బ్రహ్మాస్త్ర'తో దక్కుతుందా? అన్నది ఇప్పటికి సస్పెన్స్.
సెప్టెంబర్ 9న విడుదల కానున్న బ్రహ్మాస్త్ర ప్రచారానికి నిర్మాత కరణ్ జోహార్ కానీ... నాయకానాయికలు రణబీర్ - ఆలియా జంట కానీ ఎంతగా శ్రమిస్తున్నారో చూస్తున్నదే. ఈ మూవీతో బంపర్ హిట్ కొట్టాలని దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే బ్రహ్మాస్త్ర పూర్తి మూవీని వీక్షించిన కరణ్ స్నేహితులు దీనిపై బాహాటంగా పొగడ్తలు కురిపించారు.
రణబీర్ కపూర్ కెరీర్ లో డార్క్ స్పెల్ ముగిసినట్లు కనిపిస్తోందని కూడా పొగిడేసారు. నాలుగు సంవత్సరాల తర్వాత శంషేరా విడుదలై ఫ్లాపుగా మిగిలింది. రణబీర్ కి అది తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇప్పుడు ఆశలన్నీ సెప్టెంబర్ 9న విడుదలయ్యే బ్రహ్మాస్త్రపైనే. సినిమా ప్రివ్యూ రిపోర్టులు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. బ్రహ్మాస్త్రాన్ని చూసిన సినీ వర్గాలు పొగడ్తలు కురిపిస్తున్నాయి.
అయితే కరణ్ సినీప్రముఖుల అభిప్రాయాలను నమ్మడం లేదట. దాంతో పని లేకుండా కామన్ ఆడియెన్ అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నారని అతడికి సన్నిహితంగా ఉన్న ఒక సోర్స్ వెల్లడించింది. కరణ్ తనకు సంబంధీకుల అభిప్రాయాల కోసం ఈ చిత్రాన్ని చూపించాడు. సోదరభావం నుండి సినిమాను చూసిన వారిలో షారుఖ్ ఖాన్- S.S రాజమౌళి- ఎన్టీఆర్ జూనియర్ - ఆదిత్య చోప్రా ఉన్నారు. వారు సినిమాపై పొగడ్తలు కురిపించడాన్ని ఆపలేదుట.
వినోద పరిశ్రమకు చెందిన తన స్నేహితులు బ్రహ్మాస్త్రాన్ని ప్రశంసించడం గొప్ప విషయమేమీ కాదని కరణ్ గ్రహించాడు. అస్లీ పరీక్షా తో తబ్ హోగీ జబ్ జుంటా దేఖేగీ బ్రహ్మాస్త్ర. అసలైన పరీక్ష మాస్ ఆడియెన్ తో ఉంటుందని అతడు భావిస్తున్నాడు. అందుకే వారికోసం ట్రయల్ వేయాలని భావించాడట. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని ట్రయల్ ప్రేక్షకులకు చూపించడానికి ఆసక్తిగా ఉన్నాడు. కానీ అతని సహ నిర్మాతలు .. పంపిణీదారులు దీనిని వ్యతిరేకించారు. స్టార్ స్టూడియోస్- వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ ఈ ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నాయని సమాచారం.
'లైగర్' తో చేతులు కాల్చుకున్న తర్వాత కరణ్ 'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని పరిశ్రమ వెలుపల ఉన్న ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నాడు. సినిమాల నాణ్యత గురించి సినీ వర్గాలు నిజం చెప్పవని ఆయన గ్రహించారు. ''బ్రహ్మాస్త్ర'పై కరణ్ జోహార్ చాలా నమ్మకంగా ఉన్నాడు. సినిమా విడుదలకు రెండు వారాల దూరంలో ఉన్న ఈ చివరి దశలో కూడా సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు సూచనలివ్వగలిగే సెలెక్టెడ్ ప్రేక్షకుల కోసం ప్రీ-రిలీజ్ ట్రయల్ షోను నిర్వహించాలనుకుంటున్నాడు'' అని కరణ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే తన సహ నిర్మాతల అనుమతితోనే ఇది సాధ్యం. మునుముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.