క‌ర‌ణ్ జోహార్ కి మాస్ సినిమా చూపించిన పూరి!

Update: 2022-07-22 06:33 GMT
రౌడీబోయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా డ్యాషింగ్  డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 'లైగ‌ర్' భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. 'లైగ‌ర్' విష‌యంలో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న టీమ్ ఒక్క‌సారిగా ఊపు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు  షురూ చేసింది. 'లైగ‌ర్'  ట్రైల‌ర్ ఏకంగా అభిమానుల స‌మ‌క్షంలో రిలీజ్ చేసిన సంగ‌తి  తెలిసిందే.

హైద‌రాబాద్ ఆర్టీస్ క్రాస్ రోడ్స్ సుద‌ర్శ‌న్ థియేట‌ర్లో ట్రైల‌ర్ లాంచింగ్ ఈవెంట్  అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగింది. ఈ వెంట్ కు  బాలీవుడ్ నుంచి నిర్మాణంలో భాగ‌స్వామిగా ఉన్న క‌ర‌ణ్ జోహార్ సైతం హాజ‌ర‌య్యారు. కేవ‌లం ఆయ‌న హిందీ ప్ర‌మోష‌న్ వ‌ర‌కూ ప‌రిమిత‌మ‌వుతార‌న‌ని అంతా భావించారు. కానీ అంద‌రి అంచ‌నాల్ని త‌ల్ల‌కిందులు చేస్తూ క‌ర‌ణ్ కూడా నిన్న‌టి రోజున యువ‌కుడిలా మ‌రిపోయాడు.

థియేట‌ర్ వ‌ద్ద మాస్ ఆడియ‌న్స హంగామా చూసి స్ట‌న్ అయిపోయారు. తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే  ఇంత  హంగామా ఉంటుందా?  అని  కొత్త ఎక్స్ పీరియ‌న్స్ చూసారు. ఈ సంద‌ర్భంగా పూరి ఓ మాట అన్నారు.  మ‌న‌కు సినిమా అంటే ఎంత ఇష్ట‌మో చూపించ‌డానికి క‌ర‌ణ్ ని ఈ వేడుక‌కి తీసుకొచ్చిన్లు  తెలిపారు. ఓవైపు విజ‌య్ ఫ్యాన్స్ హ‌డావుడితో థియేట‌ర్ లోప‌ల‌..బ‌య‌టా ద‌ద్ద‌రిల్లిపోతుంది.

మ‌రోవైపు పూరికున్న మాస్ ఫాలోయింగ్ ని క‌ర‌ణ్  క‌ళ్లారా చూసారు. సిస‌లైన మాసిజం అనేది ఎలా ఉంటున్న‌ద‌న్న‌ది నిన్న‌టి స‌న్నివేశం క‌ర‌ణ్ కి క‌ళ్ల ముందు క‌నిపించింది. ఉత్త‌రాదిన  ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా చేసినా..ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టి  సినిమా చేసినా ఇలాంటి స‌న్నివేశాలుండ‌వు. ఫ్యాన్స్ హ‌డావుడి ఏమాత్రం ఉత్త‌రాది రాష్ర్టాల్లో క‌నిపించ‌దు.

కేవ‌లం తెలుగు రాష్ర్టాల్లో మాత్రమే  రేంజ్లో హడావుడి  ఉంటుంది. అందులోనూ పూరి సినిమాలంటే మాస్ లో మ‌రీ పిచ్చి పీవ‌ర్  ఉంటుంది. ప‌ల్లె..ప‌ట్ట‌ణం అనే తేడా లేకుండా ఓ హీరో గురించి మాట్లాడుకుంటున్న‌ట్లే పూరి గురించి జ‌నాలు ప్ర‌త్యేకంగా  మాట్లాడుకుంటుంటారు. అందుకే  పూరి బ్రాండ్ తోనే సినిమా మార్కెట్ అయిపోతుంది.  

ఇది కేవ‌లం ద‌ర్శ‌కుల్లో పూరి కి మాత్ర‌మే సాధ్య‌మైన ఫీట్. ఇండ‌స్ర్టీకి ఎంతో మంది ద‌ర్శ‌కులు బ్లాక్ బ‌స్ల‌ర్లు అందించొచ్చు. కానీ మాస్ జ‌నాల్లో పూరి క్రేజ్ మాత్రం ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. మ‌రి ఈ క్రాస్ బ్రీడ్ సిస‌లైన  స‌త్తా ఏంట‌న్న‌ది?  ఆగ‌స్టు 22న తెలుస్తుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్ అన్ని భాష‌ల్లో  సోష‌ల్ మీడియాలో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని పూరి క‌నెక్స్ట్-ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మించాయి.
Tags:    

Similar News