పెళ్లి కాకుండానే కవలలకు తండ్రయ్యాడు

Update: 2017-03-05 06:30 GMT
పెళ్లికి పిల్లలకు సంబంధం లేదని నిరూపించేస్తున్నారు సినిమా జనాలు. ఇప్పటికే చాలామంది తారలు సంతానం పొందేందుకు పలు రకాల మార్గాలు ఎంచుకుంటూ ఉండగా.. వాటిలో సరోగసీ కూడా ఒకటి. ఈ జాబితాలో చాలామందే ఉండగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ కూడా ఈ లిస్ట్ లో చేరాడు.

తాజాగా కరణ్ జోహార్ తన కవల పిల్లల జననాన్ని రిజిస్ట్రేషన్ చేయించినట్లు తాజాగా బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 7న ఈ రిజిస్ట్రేషన్ జరగగా.. నాలుగు వారాల పాటు ఎక్కడా లీక్ కాకుండా.. విషయం బైట పడకుండా కరణ్ జాగ్రత్తలు తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అంధేరీలోని మస్రాని హాస్పిటల్ లో ఈ పిల్లలు జన్మించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే తన సెక్సువల్ ఇష్టాలు నేరుగా ఉండవంటూ గతంలోనే ఈ దర్శకుడు వెల్లడించిన సంగతి తెలిసిందే.

2013లో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తన మూడో సంతానం అబ్రామ్ కు సరోగసీ ద్వారా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తుషార్ కపూర్ కూడా ఇదే రూట్ ఫాలో అయ్యాడు. టాలీవుడ్ లో మంచు లక్ష్మి-ఆండీల కూతురు నిర్వాణ కూడా ఇలాగే జన్మనిచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News