'బ్రహ్మస్ర్త -2' విషయంలో టీమ్ తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయాన్ ముఖర్జీ-కరణ్ అండ్ కో రాజీ అనే పదానికి తావు ఇవ్వకుండా ముందుకెళ్తున్నారు. మొదటి భాగం ఓపెనింగ్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చినా...అన్నింటిని వడ్డీతో కలిపి రెండవ భాగంతో బ్యాలెన్స్ చేస్తామన్న ధీమా టీమ్ లో కనిపిస్తుంది.
రెండవ భాగాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా మలచడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్టార్ హీరోల్ని...బాలీవుడ్ దిగ్గజాల్నే రంగంలోకి దించాలని ట్రై చేస్తున్నారు. పాన్ ఇండయన్ సినిమాగా అన్ని భాషల నటుల్ని తెరపైకి తీసుకురావాలని కరణ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రణబీర్ కపూర్ పాత్ర కోసం హతిక్ రోషన్...రణవీర్ సింగ్ పేర్లు పరిశీలను వచ్చినట్లు ప్రచారం సాగింది.
అలాగే రాకింగ్ స్టార్ యశ్ కూడా ఈ వరుసలో ఉన్నాడు. రణబీర్ పాత్ర బాధ్యతలు యశ్ కి అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని..అతని పాన్ఇండియా క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని కరణ్ మనసు అతనిపైనే ఉందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కానీ యశ్ మాత్రం ఆసక్తిచూపించడం లేదని వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈప్రచారంపై కరణ్ నోరు విప్పారు.
యశ్ పేరు ఎత్తితేనే కరణ్ ముఖం అదోలా పెట్టినట్లు కనిపిచంంది. ఇవన్నీ పుకార్లు మాత్రమేనని....ఇందులోకి యశ్ ఎలా వస్తాడు? అన్నవిధంగా కరణ్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. దేవ్ పాత్ర ఔన్నత్యం గురించి చెప్పే ప్రయత్నం చేసారు. దీన్ని బట్టి రణబీర్ పాత్రలో యశ్ లేడని క్లారిటీ వచ్చేస్తుంది. అయితే హృతిక్...రణవీర్ గురించి మాత్రం కరణ్ ఎక్కడా ప్రస్తావించలేదు.
ఈ నేపథ్యంలో దేవ్ పాత్ర విషయంలో ఇంకా చాలా కొత్త పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే యశ్ లేడు అన్న వార్తని అతని అభిమానులు కొంతమందిని నిరుత్సాహ పరిచినట్లే కనిపిస్తుంది. దేవ్ పాత్రలో యశ్ నటిస్తే బాగుంటుందని..అతనైతే పాత్రకు న్యాయం జరుగుతుందని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
మరి ఫైనల్ గా ఆ ఛాన్స్ ఎవర్ని వరిస్తుందన్నది చూడాలి. ఈ చిత్రానికి కూడా ఆయాన్ ముఖర్జీనే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన స్ర్కిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే సినిమాలో కీలక పాత్రలకు కొంత మంది స్టార్ హీరోల్నే రంగంలోకి దించాలి అన్న ఆలోచనలోనూ కరణ్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్..కలీవుడ్ హీరోలపై కరణ్ కళ్లు ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.