ఆమెలా క‌ర‌ణ్ ను మ‌రెవ‌రూ అవ‌మానించ‌లేద‌ట‌!

Update: 2019-04-29 05:09 GMT
చాలా స్నేహాలు అపోహలు.. అపార్థాల‌తో మొద‌ల‌వుతుంటాయి. మొద‌ట శ‌త్రువు అనిపించ‌నోడు.. త‌ర్వాతి కాలంలో బెస్ట్ ఫ్రెండ్ లా మార‌టం కొత్తేం కాదు. తాజాగా అలాంటి అనుభ‌వ‌మే బాలీవుడ్ దిగ్గ‌జ ప్ర‌ముఖుడికి ఎదురైంది. తాజాగా ఆ విష‌యాన్ని వెల్ల‌డించారు ద‌ర్శ‌క‌.. నిర్మాత క‌ర‌ణ్ జోహార్. బాలీవుడ్ లో అత‌గాడు ఎంత ప్ర‌ముఖుడ‌న్న విష‌యాన్ని ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

తాజాగా త‌న బెస్ట్ ఫ్రెండ్ క‌మ్ ప్ర‌ముఖ న‌టి కాజోల్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెప్పుకొచ్చారు. ఆమెతో త‌న ప‌రిచ‌యం ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పారు. తాను తొలిసారి హెన్నా మూవీ ప్రీమియ‌ర్ లో కాజోల్ ను క‌లిశాన‌ని.. ఆమెకు అక్ష‌య్ కుమార్ అంటే చాలా ఇష్ట‌మ‌ని.. అక్క‌డ ఆయ‌న క‌నిపిస్తారేమో చూసింద‌న్నారు.

ఆమెకు అక్ష‌య్ క‌నిపించ‌లేద‌ని.. తాను తోడుగా ఉన్న‌ట్లు చెప్పారు. అదే త‌మ స్నేహానికి తొలి మెట్టుగా చెప్పిన క‌ర‌ణ్.. తొలి ప‌రిచ‌యంలోనే కాజోల్ త‌న‌ను జీవితంలో మ‌రెవ‌రూ అవ‌మానించ‌నంత ఎక్కువ‌గా అవ‌మానించిన‌ట్లు చెప్పారు. త‌న‌వైపుచూసి.. తాను చేసిన ప‌నికి కాజోల్ అర‌గంట పాటు న‌వ్విన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు.

దీనిపై కాజోల్ మాట్లాడుతూ.. ఆ రోజు ప్రీమియ‌ర్ షోకు క‌ర‌ణ్.. త్రీ పీస్ సూట్ లో వ‌చ్చాడ‌ని.. అత‌డ్ని చూసినంత‌నే తాను న‌వ్వు ఆపుకోలేక‌పోయిన‌ట్లు చెప్పారు. ఏ వ్య‌క్తి అయినా ఇలాంటివి వేసుకుంటారా? అని తాను ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్లు చెప్పారు.

దీనికి ఉడుక్కుంటూ బ‌దులిచ్చిన క‌ర‌ణ్.. సూట్ వేసుకొచ్చినప్ప‌టికి త‌న వ‌య‌సు 17 ఏళ్లు మాత్ర‌మేన‌ని..  సూట్ లో తాను స‌రిపోయిన‌ట్లుగా క‌ర‌ణ్ చెప్పుకున్నారు. నాతో డ్యాన్స్ చేస్తాన‌ని కాజోల్ త‌ల్లి అన్నార‌ని.. తామిద్ద‌రం డ్యాన్స్ చేస్తుంటే.. కాజోల్ అర‌గంట పాటు ఆపుకోకుండా న‌వ్వింద‌ని.. త‌న జీవితంలో అదే అతి పెద్ద అవ‌మానంగా క‌ర‌ణ్ చెప్పుకొచ్చారు. చిన్న‌పిల్లాడిగా ఉన్న‌ప్పుడు క‌ర‌ణ్ కు ఎదురైన అవ‌మానం కేవ‌లం ఉడుక్కునేలా చేసింది. అదే.. ఇప్పుడైతే..?
Tags:    

Similar News