బాహుబలి 2.. మళ్లీ ఆయనే కొన్నాడు

Update: 2016-08-05 08:35 GMT
ఇప్పుడు బాహుబలి 2 సేల్స్ గురించి ఎక్కడ చూసినా డిస్కషన్లు జరుగుతున్నాయి. ఎందుకంటే సినిమాను అప్పుడే అమ్మేసి.. ప్రమోషన్లతో కుమ్మేసి.. ఈసారి మరింత గ్రాండుగా రిలీజ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళం, మలయాళం రైట్లను అమ్మేసిన దృష్ట్యా ఇప్పుడు హిందీ రైట్స్ ఎవరు తీసుకుంటారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.

గతంలో బాహుబలి: ది బిగినింగ్ సినిమాను మాత్రం.. హిందీలో కరణ్ జోహార్ కొనుకున్నాడు. తన ధర్మా ప్రొడక్షన్స్ బేనర్ పై సినిమాను రిలీజ్ చేశాడు. అక్కడ బాహుబలి అతి పెద్ద విజయం సాధించడానికి అతగాడే ప్రధాన కారణం. అయితే ఇప్పుడు బాహుబలి: ది కంక్లూజన్ ఆయనే తీసుకుంటాడా లేదా అనే సందేహం ఇన్నాళ్ళూ ఉందట. ఈరోజు ఉదయం ఇదే విషయంపై క్లారిటీనిస్తూ.. ''జీనియస్ డైరక్టర్ రాజమౌళితో మరోసారి చేతులు కలుపుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బాహుబలి 2 సినిమాతో వస్తున్నాం. ఏప్రియల్ 28 - 2017న గ్రాండ్ రిలీజ్'' అంటూ కరణ్‌ స్వయంగా తెలిపాడు.

సో.. మరోసారి బాలీవుడ్ లో కూడా బాహుబలి ప్రకంపనలు ఓ రేంజులో లేపుతారనమాట. ఇప్పటికే హైప్ ఒక రేంజులో ఉండటంతో.. ఇప్పుడు కరణ్‌ జోహార్ మరోసారి ప్రాజెక్టుపై చెయ్యేశాడు కాబట్టి.. అవన్నీ కలిపి బాహుబలి 2 ఏకంగా బాహుబలి 1 సాధించిన 600 కోట్ల గ్రాస్‌ కలక్షన్ రికార్డును అధిగమించేయవచ్చు కూడా.

Tags:    

Similar News