తెలుగులో టీఆర్పీ రేంటింగ్ రికార్డులన్నింటినీ బాహుబలి బద్దలు కొట్టేస్తుందని అంచనా వేశారు జనాలు. కానీ బాహుబలి అంచనాల్ని అందుకోలేకపోయింది. శ్రీరామదాసు - మగధీర తర్వాత మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఐతే హిందీలో మాత్రం టీఆర్ పీ రేటింగుల రికార్డులన్నింటినీ ‘బాహుబలి’ బద్దలు కొట్టేసిందన్నట్లు మాట్లాడుతున్న కరణ్ జోహార్. మొన్న దసరా సందర్భంగా ముందు తెలుగులో, తర్వాతి రోజు హిందీలో టీవీలో టెలికాస్ట్ అయింది బాహుబలి. ఈ సందర్భంగా బాహుబలికి అద్బుతమైన టీఆర్ పీ రేటింగులు వచ్చాయని కరణ్ చెప్పాడు.
‘‘బాహుబలి టీఆర్ పీ రేటింగుల్లో దూసుకెళ్లింది. ఇప్పుడిక రాజమౌళి అండ్ టీమ్ కు మరింత పవర్ వస్తుంది’’ అని ట్వీట్ చేశాడు కరణ్. ఈ ట్వీట్ చూసి రానా స్పందించాడు. బాహుబలి ఇంత పెద్ద విజయం సాధించడంలో కరణ్ పాత్ర చాలా ఉందని అన్నాడు. బాహుబలి సినిమాను హిందీలో రిలీజ్ చేసింది కరణే అన్న సంగతి తెలిసిందే. బాహుబలికి హిందీలోనూ అద్భుతమైన స్పందన రావడంలో కరణ్ పాత్ర ఎంతో ఉంది. అతను సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి.. గ్రాండ్ రిలీజ్ చేసి.. సినిమాకు మంచి క్రేజ్ తెచ్చాడు కరణ్. బాహుబలి-2ను కూడా కరణే రిలీజ్ చేయబోతున్నాడు.