జాన్వీ మీద అంత ఇంటరెస్ట్ దేనికో!

Update: 2018-08-22 01:30 GMT
అతిలోకసుందరి స్వర్గీయ శ్రీదేవి కూతురిగా దఢక్ తో పరిచయమైన జాన్వీ కపూర్ తెరగేట్రంతో పాస్ మార్కులు వేయించుకుంది కానీ సినిమా మాత్రం ఆశించిన రేంజ్ లో క్లాసిక్ గా మిగల్లేదు. కమర్షియల్ గా వంద కోట్ల దాకా రాబట్టి ఓకే అనిపించుకుని ఫైనల్ గా డెబ్యూ విషయంలో కపూర్ కుటుంబం పడిన టెన్షన్ ని దూరం చేసింది. అదలా ఉంచితే జాన్వీని తమ సినిమాల్లో నటింపజేసేందుకు ఇతర నిర్మాతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ దఢక్ కు నిర్మాతగా వ్యవహరించిన కరణ్ జోహారే తన తర్వాతి సినిమాల కోసం జాన్వీని లాక్ చేసుకుంటున్నట్టుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అనిపిస్తుంది. జాన్వీ రెండో సినిమాగా మల్టీ స్టారర్ ను ఎంచుకుంది. తక్త్ పేరుతో రూపొందుతున్న ఈ మూవీలో రన్ వీర్ సింగ్-విక్కి కౌశల్-అనిల్ కపూర్-కరీనా కపూర్-అలియా భట్ ఇలా పెద్ద స్టార్ కాస్ట్ తో రూపొందుతోంది. దీనికి నిర్మాత కూడా కరణ్ జోహారే. మొదటి రెండు సినిమాలు ఒకే నిర్మాతకు చేయటం అంటే విశేషమే.

కథ ఇక్కడితో అయిపోలేదు. అప్పుడెప్పుడో వచ్చిన అడల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ దోస్తానా సీక్వెల్ కోసం కూడా జాన్వీనే ఒప్పించాడని కరణ్ జోహార్ మీద గత కొద్ధి రోజులుగా వార్తలు వచ్చాయి. సిద్దార్థ్ మల్హోత్రా ఒక హీరోగా చేస్తాడని రెండో హీరో ఎంపిక జరగాల్సి ఉందని ప్రచారం జరిగింది. దీన్ని మాత్రం ట్విట్టర్ లో కరణ్ జోహార్ స్వయంగా ఖండించాడు. అదేమీ లేదని దోస్తానా 2 అనుకోలేదని అలాంటిది ఏదైనా ఉంటే ప్రకటిస్తానని కొట్టిపారేశాడు. ఇది లేదు అనుకున్నా రెండు సినిమాలు వరసగా జాన్వీకే ఆఫర్ చేయటం గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ కపూర్ ఫామిలీతో తనకున్న అనుబంధం వల్లే ఇలా ఆఫర్స్ ఇవ్వడం  తప్పించి మరో కారణం లేదంటున్నాడు. ఇదంతా బాగానే ఉంది కానీ జాన్వీని సౌత్ కు పరిచయం చేయాలనీ తాపత్రయ పడుతున్న తెలుగు తమిళ నిర్మాతల కల నెరవేరే రోజు ఎప్పుడు వస్తుందో మరి.
Tags:    

Similar News