బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ - డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. నాకు షారూక్ ఫ్యామిలీ కంటే ఎక్కువ అని కరణ్ చెబ్తాడంటే.. వీళ్ల రిలేషన్ అర్ధమవుతుంది. ఇరవై ఏళ్లకు పైగా షారూక్-కరణ్ ల బంధం ధృడమవుతూనే ఉంది.
"షారూక్ తో పని చేయడం నాకు ఎప్పుడూ ఇష్టమమే. రెండు రంగాల్లో అత్యంత ట్యాలెంటెడ్ పర్సన్స్ ఇద్దరు కలిసి పనిచేస్తే.. చూడలేని వాళ్లు చాలా మంది ఉంటారు. షారూక్ తో నా రిలేషన్ చాలా క్లోజ్. ఇప్పుడీ రిలేషన్ తన పిల్లలతో కూడా కంటిన్యూ చేస్తాను. నిజానికి నేను ఇంకా కుర్రాడిలాగే కనిపించడానికి కారణం.. ఆర్యన్ ఖాన్ ను లాంఛ్ చేయాలని అనుకోవడమే.. నేను తప్ప ఆర్యన్ ని ఇంకెవరూ లాంఛ్ చేయలేరు" అంటున్నారు కరణ్ జోహార్.
షారూక్ - కరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఖాన్ పెద్ద కొడుకును కూడా తనే డీల్ చేస్తానంటున్నాడు ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ప్రస్తుతం లండన్ లో హైయర్ స్టడీస్ చేస్తున్న ఆర్యన్.. అప్పుడప్పుడూ పార్టీల్లో మాత్రం దర్శనమిస్తూ ఉంటాడు. అయితే.. ఇప్పటికే ఆలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్ధ్ మల్హోత్రా వంటి కొత్త తరం యాక్టర్లను చాలామందినే కరణ్ లాంఛ్ చేశాడు. మరిప్పుడు ఆర్యన్ ను కూడా తానే ఇంట్రడ్యూస్ చేస్తానన్న ప్రపోజల్ కు.. బాలీవుడ్ బాద్ షా నుంచి ఎలాంటి స్పందన వస్తుందని.. ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.