సౌత్ సినిమాల్ని హిందీ పరిశ్రమలో ప్రమోట్ చేసే డీన్ గా కరణ్ జోహార్ సుపరిచితం. సౌత్ కి నార్త్ కి వారధిగానూ నిలుస్తున్నారాయన. ప్రతిష్ఠాత్మక బాహుబలి ఫ్రాంఛైజీ ఉత్తరాది రాష్ట్రాల్లో బంపర్ హిట్ కొట్టడంలో అతడి మార్కెటింగ్ టెక్నిక్ ని, ప్రమోషనల్ స్ట్రాటజీని తక్కువ అంచనా వేయలేం. హిందీ బాక్సాఫీస్ వద్ద బాహుబలి 1 - 2 చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయంటే కరణ్ ప్రమోషన్ కొంత వరకూ కారణం. బాలీవుడ్ లో ధర్మ ప్రొడక్షన్స్ అధినేతగా - దర్శకనిర్మాతగా అతడి పాపులారిటీ అసాధారణం. క్రేజీగా నటవారసుల్ని తెరకు పరిచయం చేస్తూ నిరంతరం ట్రేడ్ లో వేడెక్కిస్తూ ఉంటాడు. అంతటి పాపులారిటీ ఉన్నవాడు కాబట్టి అతడిపైనా మ్యాడమ్ టుస్సాడ్స్ కన్ను పడింది.
తాజాగా సింగపూర్ మ్యాడమ్ టుస్సాడ్స్ లో అతడి మైనపు(వ్యాక్స్) విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహంతో కరణ్ జోహార్.. ఆయన మాతృమూర్తి రుహీ జోహార్ సెల్ఫీలు దిగారు. ఆసక్తికరంగా ఈ విగ్రహంలోనూ కరణ్ జోహార్ యాటిట్యూడ్ ని టుస్సాడ్స్ కర్తలు ఆవిష్కరించారు. కరణ్ స్వతహాగానే ఫ్యాషన్ ఐకన్. రెగ్యులర్ గా కొత్త ట్రెండ్స్ ని పరిచయం చేసేందుకు ఇష్టపడతారు. బాలీవుడ్ లో పూల చొక్కాయ్ ట్రెండ్ కి ఆద్యుడు అతడే. ప్యారిస్ టు ముంబై ఏ ఫ్యాషన్ ట్రెండ్ వచ్చినా కరణ్ దానిని నిర్మొహమాటంగా అనుసరిస్తుంటాడు. అంతేకాదు కాఫీ విత్ కరణ్ షోలో అతడు తన గెస్టులందరితో సెల్పీలు దిగుతుంటాడు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో దిగ్గజాలతో, తన అభిమానులతో సెల్ఫీలు దిగి సెల్ఫీ పిచ్చోడిగానూ పాపులరయ్యాడు. అందుకే అతడి యాటిట్యూడ్ ని, అలవాట్లను ప్రతిబింబించేలా ఈ మైనపు విగ్రహాన్ని రూపొందించారు. సరిగ్గా ఎనిమిదేళ్ల వయసప్పుడు తన డాడ్ తో కలిసి టుస్సాడ్స్ మ్యూజియంకు వచ్చానని.. నేడు తన విగ్రహం అక్కడ నెలకొల్పడం ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందని కరణ్ ఈ సందర్భంగా అన్నారు.
సింగపూర్ మ్యాడమ్ టుస్సాడ్స్ లో ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ మైనపు విగ్రహం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్ లో ఈ వ్యాక్స్ స్టాట్యూని ఆవిష్కరించి అనంతరం సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంకి తరలించారు. ఇప్పుడు మహేష్ విగ్రహం పక్కనే కరణ్ జోహార్ విగ్రహం ఆవిష్కరిస్తున్నారన్నమాట!!