అన‌న్యా పాండే డేటింగ్ సీక్రెట్ చెప్పేసిన క‌ర‌ణ్‌!

Update: 2022-09-22 12:30 GMT
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ..'లైగ‌ర్' బ్యూటీ అన‌న్యా పాండే డేటింగ్ వ్య‌వ‌హారం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టిగా ప‌రిచ‌యమైన‌ నాటి నుంచి అమ్మ‌డు డేటింగ్ లో యమా స్పీడ్ అంటూ బాలీవుడ్ లో ఎప్ప‌టిక‌ప్ప‌డు క‌థ‌నాలు హీటెక్కిస్తూనే ఉంటాయి. అందులోనూ అన‌న్య విష‌యంలో వెబ్ క‌థ‌నాలు ఏమాత్రం త‌గ్గ‌వు.

ఇప్ప‌టికే ఇద్ద‌రు..ముగ్గ‌రు హీరోల‌తో డేటింగ్ చేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి. తొలుత‌ ఇషాన్ క‌ట్ట‌ర్ తో డేటింగ్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగింది. అత‌నితో క‌టీఫ్ అయిన త‌ర్వాత కార్తిక్ ఆర్య‌న్ తో ప్రేమ‌లో ప‌డిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో కార్తీక్  సారా అలీఖాన్ తోనూ రొమాన్స్ చేస్తున్నాడ‌ని అన‌న్య అత‌న్ని దూరం  పెట్టిన‌ట్లు ప్ర‌చారం సాగింది.

ఆ ఇద్ద‌రి త‌ర్వాత ఆదిత్యారాయ్ క‌పూర్ తో సైతం పాండే బ్యూటీ లిస్ట్ లో వినిపించింది. అనన్య ట్రాక్ లో ఇంత‌మంది బోయ్ ప్రెండ్స్ ఉంటే? క‌ర‌ణ్ జోహార్ ఊర‌క‌నే విడిచిపెడ‌తాడా?  ఓ ఆట ఆడేసుకోడు.  స‌రిగ్గా అదే జ‌రిగింది క‌ర‌ణ్ టాక్ షోలో. తాజా ఎపిసోడ్ లో క‌ర‌ణ్ మాట్లాడుతూ.. '' అన‌న్యా పాండే ఒకే స‌మ‌యంలో ఇద్ద‌రితో డేటింగ్ చేసింద‌ని నేను అనుకుంటున్నాను' అన్నారు.

ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా డేటింగ్ క్వ‌శ్చ‌న్ రావ‌డంతో గౌరీ ఖాన్ 'ఒకే స‌మ‌యంలో ఇద్ద‌రితో డేటింగ్ చేయ‌కండ‌ని సూచించారు. వెంట‌నే క‌ర‌ణ్ మంచి స‌ల‌హా అన్నారు. అప్పుడే భావ‌నా పాండే వైపు చూస్తూ..  'అన‌న్య ఇప్ప‌టికే   అలా చేసింద‌ని నేను అనుకుంటునున్నాను' అంటారు. దీనికి  భావ‌నా పాండే ఒక్క‌సారిగా షాక్ అవుతుంది.

ఆమె ఉందా? అంటుంది.  దానికి క‌ర‌ణ్ ఆమె మ‌ధ్య‌లో అటు ఇటు గా ఊగిస‌లాడుతున్న‌ట్లు క‌నిపిస్తుందంటాడు. ఆ వెంట‌నే భావ‌న పాండే..ఆమె ఇద్ద‌రి గురించి ఆలోచిస్తుంది కాబ‌ట్టి మ‌ర‌కొరితో విడిపోయి ఉండొచ్చు అంటుంది. దీంతో అంతా ఒక్క‌సారిగా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. గ‌త వారం కత్రినా కైఫ్ .. సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఇషాన్ క‌ట్ట‌ర్ ఇదే  షోకు అతిథిగా హాజరయ్యాడు.  కరణ్ అతనిని  "మీరు అనన్యతో ఇటీవల విడిపోయారు క‌దా' అన్నారు. దానికి ఇషాన్ నుంచి అవున‌నే స‌మాధానం వ‌స్తుంది.

అన‌న్యా  పాండే 'లైగ‌ర్' సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగతి తెలిసిందే. ఇటీవ‌ల భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన‌ సినిమా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. లేదంటే? అన‌న్య టాలీవుడ్ ని రౌండ‌ప్ చేసి సినిమాలు చేసేది. అతిగా ఆలోచించి కాళ్ల వ‌ర‌కూ వ‌చ్చిన అవ‌కాశాల్ని సైతం కాళ్ల‌ద‌న్నుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లోనే ఛాన్స్ లు కోసం ఎదురు చూస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News