బ్యాక్ అందాలతో బెబో బంధాలు!!

Update: 2017-04-12 04:41 GMT
ఫిగర్ మెయింటెయిన్ చేయడంలో కరీనా కపూర్ ఖాన్ కు ఎవరూ సాటి రాలేరనే విషయం ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. అసలు జీరో సైజ్ అందాలను ఇండియన్ స్క్రీన్ కి చూపిన ఈ భామ.. ఆ తర్వాత మెల్లిమెల్లిగా పెర్ఫామెన్స్ సైడ్ మొగ్గింది. అలాగని అభిమానులను నిరుత్సాహపరిచే టైపు కాదు బెబో.

అందుకే పెళ్లయ్యాక కూడా అంతో ఇంతో గ్లామర్ షో కంటిన్యూ చేస్తూనే.. కుర్ర హీరోతో లిప్ లాక్స్ లాగించేసింది. ఇక పర్సనల్ విషయానికొస్తే.. నాలుగు నెలల క్రితమే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కరీనా కపూర్.. అప్పుడే పార్టీలంటూ హంగామా చేసేస్తోంది. నిండు నెలల గర్భిణిగా ఉన్నపుడే రకరకాల ఫోటో షూట్స్.. పార్టీలు ఎంజాయ్ చేసిన కరీనా.. ఇప్పుడు కరన్ జోహార్ ఇచ్చిన ఓ పార్టీలో కనిపించడం పెద్ద  వింతేమీ కాదు. అయితే.. బ్లాక్ కలర్ పార్టీ ఔట్ ఫిట్స్ లో ఈ బ్యూటీ చూపించిన బ్యాక్ అందాలు.. చాలా మంది మనసులకు బంధాలు వేసేశాయి. ఒకనాటి బెబోను గుర్తు చేసి.. మళ్లీ ఆమె వయ్యారాలతో ఉన్న పాత అనుబంధాలను గుర్తు చేసేశాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది ఉడ్తా పంజాబ్ మూవీకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అందుకున్న కరీనా కపూర్.. ఇప్పుడు శశాంక్ ఘోష్ దర్శకత్వంలో వీరే దీ వెడ్డింగి మూవీకి సిద్ధమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News