ఆమీర్ ఖాన్ తో ముచ్చటగా మూడోసారి

Update: 2019-06-22 17:30 GMT
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ లాస్ట్ సినిమా 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.  ఆ సినిమా అలా నిరాశపరిచినందుకు అమీర్ ఖాన్ స్వయంగా అభిమానులను.. ప్రేక్షకులను క్షమాపణ కోరుతూ ఈ సారి మంచి చిత్రంతో వస్తానని హామీ ఇచ్చాడు.  ప్రస్తుతం అమీర్ నెక్స్ట్ సినిమా 'లాల్ సింగ్ ఛద్దా' కోసం ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది.

ఈ సినిమా హాలీవుడ్ క్లాసిక్ 'ఫారెస్ట్ గంప్' కు అధికారిక రీమేక్.  హాలీవుడ్ స్టార్ టామ్ హ్యంక్స్ కెరీర్ లో అదొక అత్యుత్తమ చిత్రంగా పేరు తెచ్చుకుంది. 1994 లో రిలీజ్ అయిన ఆ సినిమాకు ఆరు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు వరించాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అమీర్ ఖాన్ కు జోడీగా కరీనా కపూర్ ఖాన్ ను ఎంపిక చేశారు.  ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధృవీకరించారు.  అమీర్ ఖాన్ - కరీనా జోడీ గతంలో '3 ఇడియట్స్'.. 'తలాష్' సినిమాల్లో నటించారు. ఇది వారికి హ్యాట్రిక్ చిత్రం కానుంది.

ప్రస్తుతం ఈ రీమేక్ కు సంబంధించిన స్క్రిప్ట్ ను మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా అతుల్ కులకర్ణి తయారు చేస్తున్నారు. అమీర్ ఖాన్ తో గతంలో 'సీక్రెట్ సూపర్ స్టార్' చిత్రాన్ని రూపొందించిన అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్.. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ కు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Tags:    

Similar News