దేశ జనాభా పెరగడం కోసం ఇప్పటికే నా భర్త చాలా చేశారు

Update: 2022-07-20 09:53 GMT
బాలీవుడ్‌ లోనే కాకుండా టాలీవుడ్‌ కోలీవుడ్ లో కూడా హీరోయిన్స్ కు పెళ్లి అయినప్పటి నుంచి కూడా ప్రెగ్నెన్నీ వార్తలు వస్తూనే ఉంటాయి. పెళ్లి అయిన కొన్నాళ్లకే ఆమె తల్లి కాబోతుందని.. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతుంది అంటూ రకరకాలుగా పుకార్లు పుట్టిస్తూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటారు. తాజాగా కరీనా కపూర్ ఖాన్ తల్లి కాబోతుందనే వార్తలు బాలీవుడ్ మీడియాలో గుప్పుమన్నాయి.

ఇప్పటికే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన కరీనా కపూర్‌ ఖాన్‌ మూడవ బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉందని.. ఆమె గర్భం దాల్చడం వల్లే విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటుందనే పుకార్లు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో ఆమె స్వయంగా స్పందించాల్చి వచ్చింది.

తాను ప్రెగ్నెంట్‌ కాదు బాబోయ్‌ అన్నట్లుగా ఆమె క్లారిటీ ఇస్తూనే ఫన్నీ కామెంట్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

సోషల్‌ మీడియా ద్వారా తన మూడవ ప్రెగ్నెన్నీ వార్తలను ఖండించింది. యూరప్ లో ఆమె హాలిడే ట్రిప్ కు వెళ్లింది. ఆ సమయంలో అక్కడ దిగిన కొన్ని ఫోటోల్లో ఆమె లావు అయినట్లుగా.. ఆమె గర్బం దాల్చినట్లుగా పొట్ట లావు ఉన్నట్లుగా అనిపించింది అందుకే సోషల్‌ మీడియాలో ఆ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగాయి.

కాని కరీనా కపూర్ ఖాన్‌ తాను గర్బవతిని కాదని తెలియజేసింది. నా పొట్టలో ఉన్నది పాస్తా మరియు వైన్‌ మాత్రమే. నేను గర్భవతిని కానే కాదు. అయినా ఇప్పటికే నా భర్త దేశ జనాభా పెరగడం కోసం తన వంతుగా చాలా కష్టపడ్డాడు. ఇంకా దేశ జనాభా పెంచే ఉద్దేశ్యం లేదు అన్నట్లుగా ఫన్నీ కామెంట్స్ ను కరీనా కపూర్‌ చాలా స్పోర్టివ్‌ గా చేసింది.

సైఫ్ అలీ ఖాన్‌ గతంలోనే ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. ఆ పిల్లలు ఇప్పుడు పెరిగి పెద్ద వారు అయ్యారు. మొదటి భార్యతో విభేదాల కారణంగా విడి పోయిన సైఫ్‌ అలీ ఖాన్‌ ఆ తర్వాత కరీనా కపూర్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు జన్మించారు. కనుక ఇంకా పిల్లలు కనే ఉద్దేశ్యం సైఫ్‌ అలీ ఖాన్‌ కు లేనట్లే అంటూ కరీనా కపూర్‌ పోస్ట్‌ ద్వారా చెప్పకనే చెప్పింది.
Tags:    

Similar News