మన హీరోయిన్‌ కు ఐసీసీ అరుదైన గౌరవం

Update: 2019-10-31 10:22 GMT
వచ్చే ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ పోటీలు జరుగబోతున్న విషయం తెల్సిందే. ఫిబ్రవరి 21 నుండి మార్చి 8 వరకు ఉమెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌ పోటీలు జరుగనుండగా అక్టోబర్‌ 18 నుండి నవంబర్‌ 15 వరకు పురుషుల టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ ల కోసం ఇప్పటి నుండే ఏర్పాట్లను ఐసీసీ మొదలు పెట్టింది. ఆస్ట్రేలియాలో జరుగబోతున్న ఈ రెండు టీ20 వరల్డ్‌ కప్‌ సిరీస్‌ లకు సంబంధించిన ట్రోఫీలను త్వరలో ఆస్ట్రేలియాలో ఐసీసీ ఆవిష్కరించబోతుంది.

ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ ట్రోఫీ లను ఆవిష్కరించేందుకు గాను ప్రముఖులను ఆహ్వానించింది. ఇందుకు గాను బాలీవుడ్‌ నుండి ప్రముఖ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఖాన్‌ హాజరు కాబోతుంది. బీసీసీఐ కరీనాను ట్రోఫీ ఆవిష్కరణకు పంపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఐసీసీ కీలక నిర్ణయాలు బీసీసీఐ సూచనల మేరకు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఐసీసీ ట్రోఫీ ఆవిష్కరణకు మన హీరోయిన్‌ కు ఛాన్స్‌ దక్కింది.

ఈ సందర్బంగా కరీనా కపూర్‌ మాట్లాడుతూ ఈ ప్రపంచ స్థాయి టోర్నీలో భాగస్వామ్యం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు దక్కిన పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. ఈ టోర్నీలో ఆడబోతున్న అమ్మాయిలంతా కూడా వారి వారి దేశాల మహిళలకు ఆదర్శం అంటూ చెప్పుకొచ్చింది. ఇక భారత జట్టు తరపున ఆడిన ఎంతో మంది లెజెండ్స్‌ లో మా మామగారు ఒక్కరు అవ్వడం కూడా నాకు గర్వకారణం అంది.

టీం ఇండియా మాజీ కెప్టెన్‌ మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ తనయుడు సైఫ్‌ అలీఖాన్‌ అనే విషయం తెల్సిందే. సైఫ్‌ అలీ ఖాన్‌ భార్య కరీనా కపూర్‌ ఖాన్‌. ఈ సిరీస్‌ లో మొత్తం 12 జట్లు ఆడబోతున్నాయి. ఇప్పటికే 8 జట్లు ఖరారు కాగా మరో నాలుగు జట్లు క్వాలిఫైర్‌ మ్యాచ్‌ ల ద్వారా ఎంపిక కానున్నాయి.

Tags:    

Similar News