అందం చూపించడం కూడా ఆర్టే

Update: 2017-08-27 05:59 GMT
హిందీ సీరియల్స్ లో తెగ కనిపించేసే అందగత్తె కరిష్మా శర్మ. సీరియల్స్ లో హీరోయిన్ అయినా.. సినిమా హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఈమె క్రేజ్ ఉంటుంది. గ్లామర్ విషయంలో ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉండే కరిష్మా శర్మకు.. కెమేరా ముందు అందాలు ఆరబోయడంలో పెద్దగా అభ్యంతరాలు ఉండవు. అయితే.. బుల్లితెరపై ఈమె చేసే రోల్స్ కాసింత సాంప్రదాయబద్ధంగానే ఉంటాయి. అందుకే తన అల్ట్రా మోడర్న్ అవతార్ ను చూపించేందుకు సోషల్ మీడియాను బాగానే ఉపయోగించేసుకుంటుంది కరిష్మా.

ఫోటో షూట్స్ తో తెగ మత్తెక్కించేసే కరిష్మా శర్మ.. లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన పిక్ ఒకటి.. చూపరుల మతి పోగొట్టేస్తోంది. బ్లాక్ బ్రా.. సేమ్ కలర్ బాటమ్ తో పోజ్ ఇచ్చిన ఈ భామ.. ఓ డెనిమ్ జాకెట్ ను ఉండీ లేనట్లుగా తగిలించుకుంది. నల్లని గార్మెంట్స్ లో మెరిసిపోతున్న ఈ అమ్మడు.. స్కిన్ టోన్ తోనే సగం మందిని మత్తులో ముంచేస్తోంది. ఇక ఆ బ్లాక్ వేర్ లో కొంత భాగాన్ని ట్రాన్స్ పరెంట్ గా డిజైన్ చేయడంలో.. మిగిలిన సగం మంది మైకంలో పడిపోతున్నారు. ఇంత గ్లామరస్ గా ఫోటో పెట్టిన ఈ బ్యూటీ.. దానికి క్యాప్షన్ మాత్రం కాసింత వేదాంతాన్ని మిక్స్ చేయడం ఆశ్చర్యకరమే.

"ఎప్పుడూ గమ్యం ఏంటనేది ముఖ్యం కాదు. ప్రయాణం ఎలా ఉంది.. దాన్ని ఎంతగా ఎంజాయ్ చేశామన్నదే ముఖ్యం. ప్రేమను.. సంతోషాన్ని పంచండి" అంటూ చెప్పుకొచ్చిన కరిష్మా శర్మ.. లవ్ ఫెయిల్యూర్స్ పై తనదైన స్టైల్ లో ఇలా రియాక్ట్ అయిందన్న మాట.
Tags:    

Similar News