నా ప్రేమలో మీరంతా బంధీలేః కరిష్మా

Update: 2021-02-08 02:30 GMT
‘నా ల‌వ్ నుంచి మీరెవ్వ‌రూ ఎక్కేప్ కాలేరు’ అంటోంది బాలీవుడ్ బ్యూటీ కరిష్మా తన్నా! తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేని ఈ బ్యూటీ.. నెటిజ‌న్ల‌కు మాత్రం బాగా క్లోజ్‌! 2018లో ‘సంజు’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ భామ.. ఆ తర్వాత ‘గ్రాండ్ మస్తీ’ వంటి అడల్ట్ కంటెంట్ సినిమాల్లోనూ బోల్డ్ గా నటించింది.

అయితే.. ఈ అమ్మడు వెండి తెరకన్నా.. స్మాల్ స్క్రీన్ పై ఫుల్ ఫేమస్. దాదాపు దశాబ్దంన్నరకు పైగా టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తోంది కరిష్మా. ఓ వైపు బుల్లితెరపై నటిస్తూనే.. మధ్యలో సినిమాలు కూడా చేస్తూ యమా బిజీగా ఉంటోంది.

అయితే.. మధ్య మధ్యలో తన హాట్ పిక్స్ తో కుర్రాళ్ల గుండెల్లో గునపాలు దింపుతూనే ఉంటోంది కరిష్మా తన్నా. నెటిజన్లకు బీచ్ బికినీ పార్టీస్ తోపాటు బోల్డ్ పిక్స్ తో భారీ ట్రీట్ ఇస్తూ ఉంటుందీ బ్యూటీ. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ పిక్ పోస్ట్ చేసింది.

ఆదివారం పూట మేకప్ లేదు.. ఎడిటింగ్ లేదు.. కేవలం లవ్ మాత్రమే ఉంది అంటూ పై ఫొటోను పోస్ట్ చేసిన కరిష్మా.. ‘నా ప్రేమ నుంచి మీరు తప్పించుకోలేరు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. మరి, ఇలాంటి పిక్స్ షేర్ చేస్తుంటే ఎవరు మాత్రం తప్పించుకోగలరు చెప్పండి.. అందులో చిక్కుకొని గిల్లగిల్లగిల్ల కొట్టుకోవడం తప్ప!




Tags:    

Similar News