తెలుగు, తమిళ భాషల్లో సూర్యతో పాటు తన సోదరుడు కార్తికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మంచి మార్కెట్ కూడా వున్న విషయం తెలిసిందే. సొంత భాష తమిళంలో ఏ స్థాయి మార్కెట్ వుందో కార్తికి తెలుగులోనూ అదే స్థాయి మార్కెట్ వుంది. అంతే కాకుండా విభిన్నమైన కథలతో సరికొత్త సినిమాలని అందిస్తూ తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న కార్తి `ఆవారా`తో హీరోగా మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు.
`ఖైదీ` బ్లాక్ బస్టర్ హిట్ తో ట్రాక్ లోకి వచ్చేసిన కార్తి బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్నాడు. రీసెంట్ గా దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన `పొన్నియిన్ సెల్వన్ 1`తో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో విక్రమ్ కు సహయకుడిగా వల్లవ రాయన్ వంధ్యదేవన్ గా కీలక పాత్రలో నటించి ఔరా అనిపించాడు. అయితే తమిళ నాట కంటే తెలుగులో ఈ సినిమా ఆ రేంజి హిట్ ని సొంతం చేసుకోలేకపోయింది.
కానీ కార్తికి మాత్రం కెరీర్ పరంగా సరికొత్త జోష్ ని, సరికొత్త ఉత్సాహాన్ని అందించడమే కాకుండా హీరోగా కార్తిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా అందించిన సక్సెస్ జోష్ లో వున్న కార్తి ఈ సారి సోలోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ `సర్దార్`తో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కార్తి కెరీర్ లోనే అత్యంత భారీబడ్జెట్ తో అత్యంత భారీ స్థాయిలో రూపొందిన సినిమా ఇది. ఇందులో కార్తి తండ్రిగా, తనయుడిగా రెండు భిన్నమైన పాత్రల్లో నటించాడు.
దీపావళి సందర్భంగా విడుదలైన ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో నాగార్జున రిలీజ్ చేసిన ఈ మూవీకి యావరేజ్ టాక్ వున్నా తమిళంలో మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అంతే కాకుండా వసూళ్ల పరంగానూ ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి కార్తి కెరీర్ లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా చెబుతున్నారు. తొలి వారంలో ఈ మూవీ రూ.80 కోట్ల మేర వసూలు చేసిందని తెలిసింది.
`సర్దార్` రిజల్ట్ తో పాటు సాధిస్తున్న వసూళ్ల విషయంలో హీరో కార్తి ఫుల్ హ్యాపీగా వున్నాడట. `యువ` సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన కార్తి ఆ తరువాత సూర్య ప్రోత్సాహంతో `పరుత్తివీరన్` సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించాడు. అప్పటి నుంచి హీరోగా తనదైన మార్కు సినిమాలు చేస్తున్న కార్తికి `సర్దార్` స్టార్ ని చేయడం ఖాయం అనే కోలీవుడ్ లో వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.